పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్‌లో జరిగిన పేలుడులో ఇప్పటివరకు 44 మంది మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 200 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పాకిస్థాన్‌(Pakistan)లోని ఖైబర్ పఖ్తుంఖ్వా(Khyber Pakhtunkhwa) ప్రావిన్స్‌లోని బజౌర్‌లో జరిగిన పేలుడులో ఇప్పటివరకు 44 మంది మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 200 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో చాలా వీడియోలు వైరల్(Viral) అవుతున్నాయి. దాడి చేసిన వ్యక్తి తనను తాను పేల్చేసుకున్న దృశ్యాన్ని కెమెరా క్యాప్చర్ చేసింది. జమియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ నిర్వ‌హించిన స‌మావేశంలో ఈ పేలుడు జరిగింది. ఈ పార్టీ పాకిస్తాన్ పాలక కూటమికి మిత్రపక్షం కాగా.. దాని నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్.

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్‌లో జమియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్(Jamiat Ulema-e-Islam-Fazl) స‌మావేశం జరుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వేదికపై నాయకులు మాట్లాడుతుండగా.. ప్రజలు వారి మాటలు వింటున్నారు. ఇంతలో జనం గుంపులో ఉన్న ఓ సూసైడ్‌ బాంబర్ త‌న‌ను తాను పేల్చుకున్నాడు. పేలుడు సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ ఉన్నారు. దీని కారణంగా ఎక్కువ ప్రాణనష్టం జరిగింది.

ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పాక్ పోలీసులు(Pakistan Police) ఒక ప్రకటనలో తెలిపారు. పేలుడు పదార్థాలు ఉన్న జాకెట్‌(Jocket)ను ధరించి స‌మావేశం వద్దకు వచ్చిన దుండగుడు.. స‌మావేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్న స‌మ‌యంలో దానిని పేల్చాడు. దాడి చేసిన వ్యక్తి వేదిక సమీపంలో సూసైడ్ బాంబ్‌(Suicide Bomb)ను పేల్చాడు. దీని కారణంగా జమియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్‌కు చెందిన చాలా మంది నాయకులు పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. ఈ స‌మావేశానికి పార్టీ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్(Maulana Fazlur Rehman) హాజరుకాలేదు.

పేలుడు(Blast) జరిగిన ప్రదేశం బజౌర్ జిల్లా(Bajaur District) పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతానికి.. రాడికల్ తెహ్రీక్-ఇ-తాలిబాన్ యొక్క‌ బలమైన కోటగా పేరుంది. జమియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ నాయకుడు.. మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్‌ను కూడా సాధారణంగా స్థానిక ఇస్లామిక్ సంస్థలకు మద్దతుదారుగా పరిగణిస్తారు. ఇస్లామిక్ స్టేట్(Islamic State) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ నుండి పనిచేస్తుంది. ఇస్లామిక్ సంస్థలను ఇరుకున పెట్టేందుకే ఈ దాడి జరిగిందని తెహ్రీక్-ఇ-తాలిబాన్(Tehreek-e-Taliban) ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated On 30 July 2023 11:51 PM GMT
Yagnik

Yagnik

Next Story