అగ్రరాజ్యం అమెరికాలో(america) మరోసారి గన్‌ పేలింది

అగ్రరాజ్యం అమెరికాలో(america) మరోసారి గన్‌ పేలింది. జార్జియా(Georgia) సమీపంలోని అపాలాచీ హైస్కూల్‌లో బుధవారం జరిగిన కాల్పులలో(Gun firing) నలుగురు చనిపోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం పది పదిన్నర మధ్యలో అపాలాచీ హై స్కూల్‌లో( Apalachee High school) కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పటిల్‌కు తరలించారు. కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. 14 సంవత్సరాల విద్యార్థి కోల్ట్‌ గ్రేను అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అభియోగాలను నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బారో కౌంటీ దక్షిణ అంచున ఉన్న అపాలాచీ నది పేరును ఈ స్కూల్‌కు పెట్టారు. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బైడన్‌(Joe Bidden) , జిల్‌ బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(Kamla harris) కూడా కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గన్‌ కల్చర్‌కు(Gun culture) ముగింపు పలకాలని పిలుపునిచ్చారు

Eha Tv

Eha Tv

Next Story