Canada : కెనడాలో టెస్లా కారు క్రాష్.. నలుగురు భారతీయులు మృతి
కెనడాలో(Canada) జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు చనిపోయారు.
కెనడాలో(Canada) జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు చనిపోయారు. ఎలాన్ మస్క్(Elon musk) టెస్లా(Tesla) కారులో వారు ప్రయాణిస్తుండగా కారు క్రాష్ అయ్యి నలుగురు చనిపోయారు. టొరంటో(Toronto) సమీపంలో అర్థరాత్రి తర్వాత కారు డివైడర్‌ను(divider) ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వారు ప్రయాణిస్ఉన్న కారులో మంటలు చెలరేగాయి. అయితే వారు ఎక్కడికి వెళుతున్నారు? ఆ సమయంలో టెస్లా సెల్ఫ్ డ్రైవ్ మోడ్‌లో ఉందా? అనేది మాత్రం తెలియదు. చనిపోయినవారిలో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన 30 ఏళ్ల కేతా గోహిల్, 26 ఏళ్ల నిల్‌గోహిల్ ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్నారు. ఇందులో 20 ఏళ్ల మహిళ కారు నుంచి బయటకు వచ్చి వాహనదారుల సాయం కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పలువురు కారు అద్దాలు పగలగొట్టి సాయం చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే కారు తగలబడింది.