Fetus growing In Bowel : భరించలేనంత కడుపునొప్పితో హాస్పిటల్‌కు వచ్చిన మహిళ..పరీక్షలు చేసిన డాక్టర్లు షాకయ్యారు!
ఫ్రాన్స్‌కు(France) చెందిన 37 ఏళ్ల మహిళ విపరీతమైన కడుపు నొప్పితో(Stomach Pain) అల్లాడిపోయింది. పది రోజులుగా నొప్పి ఉన్నా ఎలాగో అలాగ భరిస్తూ వచ్చింది. కానీ తట్టుకోలేనంత నొప్పి రావడంతో హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ డాక్టర్లు అన్ని టెస్ట్‌లు చేశారు. స్కానింగ్(Scanning) చేశారు. ఆమె కడుపులో పిండం పేగుల్లో(Small Intestine) పెరుగుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు.
ఫ్రాన్స్‌కు(France) చెందిన 37 ఏళ్ల మహిళ విపరీతమైన కడుపు నొప్పితో(Stomach Pain) అల్లాడిపోయింది. పది రోజులుగా నొప్పి ఉన్నా ఎలాగో అలాగ భరిస్తూ వచ్చింది. కానీ తట్టుకోలేనంత నొప్పి రావడంతో హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ డాక్టర్లు అన్ని టెస్ట్‌లు చేశారు. స్కానింగ్(Scanning) చేశారు. ఆమె కడుపులో పిండం పేగుల్లో(Small Intestine) పెరుగుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. సాధారణంగా గర్భాశయంలో పిండం పెరుగుతుంది. కానీ ఇలా పేగుల్లో పిండం(fetus) పెరిగడం ఇదే మొదటిసారి అని డాక్టర్లు చెబుతున్నారు. పిండం గర్భాశయం(Uterus) నాళికలో కాకుండా బయట ఎక్కడ పెరిగినా పిండ విచ్ఛత్తి కావడమో, గర్భం నిలవకపోవడమో జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం పిండం పేగుల్లో చక్కగా పెరుగుతున్నదని డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె సరిగ్గా 23 వారాల గర్భవతి అని నిర్ధారించారు వైద్యులు. ఇలా పేగులో పిండం పెరగడాన్ని ఉదర ఎక్టోపిక్ గర్భం(Ectopic pregnancy) అని అంటారట! ఆ మహిళను తమ పర్యవేక్షణలోనే పెట్టుకున్న డాక్టర్లు 29 వారాల తర్వాత ఆమెకు ప్రసవం చేశారు. మూడు నెలల అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇలాంటి ఎక్టోపిక్ గర్భాలు అంతర్గత రక్తస్రావం అయ్యి ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుందని, దీని వల్ల తల్లి, బిడ్డలిద్దరికి కూడా ప్రమాదమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని ఆమెకు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి డెలివరీ చేశామన్నారు. ఇలాంటి కేసుల్లో 90 శాతం వరకు శిశువులను కోల్పోయే అవకాశాలే ఎక్కువుగా ఉంటాయని, ఒకవేళ శిశువు జీవించినా కూడా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయని వివరించారు. కానీ ఈ మహిళ విషయంలో అలాంటివి జరగనివ్వకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న శిశువును బయటకు తీయగలిగామని డాక్టర్లు తెలిపారు.