సుమారు మూడు శతాబ్దాల కిందట టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో స్పెయిన్‌కు బయలుదేరిన శాన్‌జోస్‌ అనే ఓ నౌక శత్రువుల దాడిలో దెబ్బతిని కరేబియన్‌ సముద్రంలో మునిగిపోయింది. ఆనాటి నుంచి అత్యంత విలువైన ఆ నిధి రత్నాకరంలోనే భద్రంగా ఉంది. కొన్నేళ్ల కిందట మునిగిన ఆ నౌకను గుర్తించారు కానీ వాటాల్లో తేడా వచ్చి దాన్ని బయటకు తీయలేదు.

సుమారు మూడు శతాబ్దాల కిందట టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో స్పెయిన్‌కు బయలుదేరిన శాన్‌జోస్‌ అనే ఓ నౌక శత్రువుల దాడిలో దెబ్బతిని కరేబియన్‌ సముద్రంలో మునిగిపోయింది. ఆనాటి నుంచి అత్యంత విలువైన ఆ నిధి రత్నాకరంలోనే భద్రంగా ఉంది. కొన్నేళ్ల కిందట మునిగిన ఆ నౌకను గుర్తించారు కానీ వాటాల్లో తేడా వచ్చి దాన్ని బయటకు తీయలేదు. ఇప్పుడో దేశం ఆ నిధి మీద కన్నేసింది. దాన్ని దక్కించుకోవడానికి పయత్నిస్తోంది. ఆ పురాతన నౌకను తాము పరిశోధిస్తామని ఇటీవల కొలంబియా ప్రకటించింది. ఈ ప్రకటనతో చాలా దేశాలు ఉలిక్కిపడ్డాయి. అమెరికా, స్పెయిన్‌, పెరూ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. పెరూ ఎందుకు అలెర్టయ్యిందంటే ఆ బంగారం, వెండి, రత్నాలు అన్నింటిని తమ దేశం నుంచే తీసుకెళ్లారు కాబట్టి. 1708వ సంవత్సరంలో జరిగిందీ ఘటన. స్పెయిన్‌కు చెందిన ఆ నౌక పెరూలోని దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలను తీసుకుని కొలంబియాకు బయలుదేరింది. కరేబియన్‌ తీరం నుంచి ప్రయాణం మొదలు పెట్టిన ఈ నౌకపై శత్రువులు దాడి చేశారు. నౌకలో ఉన్న 600 మంది సిబ్బందిలో చాలా మంది ప్రాణాలు కొల్పోయారు. కొందరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి విలువైన ఆ సంపద సముద్రగర్భంలోనే ఉంది. 600 మీటర్ల లోతులో ఉన్న ఈ శిథిల నౌకలో సుమారు 64 భారీ రాగి తుపాకులు కూడా ఉన్నాయి. ఆనాడు ఈ నౌకతో పాటుగానే ఉన్న మరో నౌక మాత్రం దాడి నుంచి తప్పించుకుంది. ఆ నౌకలో కూడా విలువైన సంపదనే ఉంది.
ఇన్నాళ్లకు కొలంబియా ప్రభుత్వం ఈ నిధిపై దృష్టి సారించింది. ది కొలంబియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రోపాలజీ అండ్‌ హిస్టరీ సంస్థ ప్రత్యేకమైన రిమోట్‌ సెన్సర్లను ఉపయోగించి నౌకను ఫోటోలు తీయనుంది. వీటి ఆధారంగా పరిశోధన కొనసాగుతుందని కొలంబియా ప్రకటించింది. నిజానికి ఈ సంపదపై కొలంబియా ప్రభుత్వానికే హక్కు ఉంది. 1981లో అమెరికాకు చెందిన సీసెర్చి ఆర్మడా అనే సముద్రగర్భాన్వేషణ సంస్థ ఈ నౌక శకలాలను కనుగొంది. సంపద వెలికితీతలో కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చోలేకపోయింది. 2015లో తాము నౌక శకలాలను కనుగొన్నామని కొలంబియా తెలిపింది. స్పెయిన్‌, పెరూ దేశాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవేనంటున్నాయి. ఇప్పటి వరకు ఆ నౌక మునిగిపోయిన ప్రాంతం కొలంబియా, ఎస్‌ఎస్‌ఏ కంపెనీలకు తప్ప మరొకరికి తెలియదు.

Updated On 25 May 2024 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story