Israel : ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి.. 300 మందికి పైగా మృతి
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల దాడిలో 300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ వైద్య అధికారుల ప్రకారం..
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల దాడిలో 300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ వైద్య అధికారుల ప్రకారం.. ఉగ్రవాదుల దాడిలో 300 మందికి పైగా మరణించారు. గాయపడిన 908 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడిని యుద్ధంగా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారని అన్నారు. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. దానికి వారు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించారు. హమాస్ ఉగ్రవాదులు చేసిన ఈ దాడికి సంబంధించి భారత ప్రభుత్వం అక్కడి ఉన్న భారత పౌరులకు సలహా కూడా జారీ చేసింది.
ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన గోకు మనవాలన్ అనే భారతీయ విద్యార్థి చాలా భయాందోళనకు గురయ్యాడు. వార్తా సంస్థ ANI విడుదల చేసిన వీడియోలో గోకు మాట్లాడుతూ.. నేను చాలా భయపడ్డాను. మాకు ఆశ్రయం ఇవ్వడానికి ఇజ్రాయెల్ పోలీసు బలగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మేం క్షేమంగా ఉన్నాం. మేము భారతీయ రాయబార కార్యాలయ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నాము, మా చుట్టూ భారతీయ సంఘం ఉంది. మేము కనెక్ట్ అయ్యామని వెల్లడించాడు.
ఇదిలావుంటే.. ఎట్టకేలకు నటి నుష్రత్ భారుచాను సంప్రదించగలిగామని, ఎంబసీ సహాయంతో ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువస్తున్నామని నుష్రత్ భారుచా బృందం సభ్యుడు సంచిత త్రివేది వార్తా సంస్థ ANIకి తెలిపారు. ఆమె క్షేమంగా భారత్‌కు వస్తోందని వెల్లడించారు. హైఫీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుస్రత్ ఇజ్రాయెల్ వెళ్లారు. హమాస్ దాడి తర్వాత ఆమెను సంప్రదించలేకపోయామని బృందం ఆందోళన చెందింది.