మాస్కోపై(Mascow) ఉక్రెయిన్‌(Ukrain) డ్రోన్‌ దాడులు(Drone Attacks) జరపడాన్ని రష్యా(Russia) సీరియస్‌గా తీసుకుంది. బదులుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌(Kiev) పై దాడులను తీవ్రం చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా పది క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులలో ముగ్గురు చనిపోయారు.

మాస్కోపై(Mascow) ఉక్రెయిన్‌(Ukrain) డ్రోన్‌ దాడులు(Drone Attacks) జరపడాన్ని రష్యా(Russia) సీరియస్‌గా తీసుకుంది. బదులుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌(Kiev) పై దాడులను తీవ్రం చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా పది క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులలో ముగ్గురు చనిపోయారు. వీరిలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉంది. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయ. మే నెలలో కీవ్‌పై రష్యా 17 దాడులు చేసింది. ఇందులో చాలా వరకు రాత్రి వేళల్లో జరిగినవే! తాజా దాడులకు సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్‌ అధికారులు విడుదల చేశారు. ఉక్రెయిన్‌పై దాడులు మొదలు పెట్టిన తర్వాత ఇటీవల రష్యా ఆత్మాహుతి డ్రోన్‌లు, క్రూజ్‌ క్షిపణులను(Cruise missiles) ఎక్కువగా వాడుతోంది.

ఉక్రెయిన్‌ ఎదురుదాడికి పాల్పడకుండా ఉండేందుకు ఆ దేశ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం ఉక్రెయిన్‌ జరిపిన షెల్లింగ్‌(Shelling) కారణంగా లుహాన్స్క్‌ ప్రాంతంలో ఓ కోళ్లఫారం దగ్గర అయిదుగురు చనిపోయారని, 19 మంది గాయపడ్డారని రష్యా చెబుతోంది. గరువారం తెల్లవారుజామున బెల్గోరోడ్‌లోని షెబ్‌ కిబినో దగ్గర ఉక్రెయిన్‌ జరిపిన దాడిలో ఇద్దరు గాయపడ్డారు. రాత్రిపూట దాదాపు గంటన్నర పాటు ఉక్రెయిన్ దళాలు షెల్లింగ్‌ చేసింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌కు మరో 300 మిలియన డాలర్ల ప్యాకేజీని అమెరికా అందచేస్తుండటాన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. తమను వ్యూహాత్మకంగా ఓడించడానికే అమెరికా ఇలా చేస్తోందని విమర్శించింది.

Updated On 1 Jun 2023 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story