Auctions For Virginity : కన్యత్వాన్ని 18 కోట్లకు వేలం వేసుకున్న యువతి..!
మాంచెస్టర్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని తన కన్యత్వాన్ని ఆన్‌లైన్ వేలం ద్వారా రూ.18 కోట్లకు విక్రయించింది.

మాంచెస్టర్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని తన కన్యత్వాన్ని ఆన్‌లైన్ వేలం ద్వారా రూ.18 కోట్లకు విక్రయించింది. హాలీవుడ్ సెలబ్రిటీ ఈ వేలంలో విజేతగా నిలిచారు. సాహసోపేతమైన, వివాదాస్పద చర్యలో 22 ఏళ్ల మాంచెస్టర్ విద్యార్థిని లారా తన కన్యత్వాన్ని ఆన్‌లైన్‌లో వేలం వేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. చివరికి రూ.18 కోట్లు (£1.7 మిలియన్లు) తీసుకొని తన కన్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైంది. ఎస్కార్ట్ ఏజెన్సీ(Escort Agency) ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించిన ఈ వేలంలో రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, ప్రముఖులు సహా సెలెబ్రిటీలు ఆసక్తి కనబర్చారు. చివరికి హాలీవుడ్ సెలెబ్రిటీ ఈ వేలంలో విజేతగా ప్రకటించబడ్డారు. లారా తన నిర్ణయం పట్ల ఎటువంటి విచారం వ్యక్తం చేయలేదు. ఆర్థిక భద్రత వైపు ఒక ఆచరణాత్మక అడుగుగా ఆమె తన వేలాన్ని సమర్థించుకుంది. ఈ వేలం అందరి దృష్టిని ఆకర్షించింది. ధనవంతులు బిడ్‌లు వేయడానికి పోటీ పడ్డారు. ఆసక్తి ఉన్నవారిలో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారని లారా తెలిపింది. ఒప్పందాన్ని ఖరారు చేసిన తర్వాత, ఆమె తన కన్యత్వాన్ని నిర్ధారించడానికి కొనుగోలుదారు సమక్షంలో వైద్య పరీక్ష చేయించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ''నేను చింతించడం లేదు, చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతారు. కనీసం నేను నా భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది.
