Survey Reveals : భారతీయ బిజినెస్మెన్లు విదేశాలవైపు చూపు..!
రిచ్ ఇండియన్స్ ఆలోచనా విధానంపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికవర విషయాలు బయటపడ్డాయి.

రిచ్ ఇండియన్స్ ఆలోచనా విధానంపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికవర విషయాలు బయటపడ్డాయి. బడాబాబుల్లో దాదాపు 22 శాతం మంది భారతదేశాన్ని వదిలి వెళ్లాలని భావిస్తున్నారట. భారత్‌లోని జీవన స్థితిగతులు, వ్యాపార వాతావరణంతో పోలిస్తే విదేశాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని వారు తెలిపారు. కోటాక్ ప్రైవేట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంయుక్తంగా 150 మంది శ్రీమంతులను సర్వే చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈలలో స్థిరపడాలని భావిస్తున్నట్లు సదరు సూపర్ రిచ్ వ్యక్తులు తేల్చి చెప్పారు. యూఏఈలోని గోల్డెన్ వీసా స్కీం ఆకట్టుకునేలా ఉందన్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతీ ఐదుగురు భారతీయ అల్ట్రా హై నెట్‌వర్త్ శ్రీమంతుల్లో ఒకరు విదేశాలకు వలస వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. తమ భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే, వీలు కుదిరితే విదేశాల్లో సెటిల్ అయిపోవాలనే ఆలోచన వారి మనసుల్లో ఉందట. విదేశాల్లో జీవన ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు, విద్యారంగం, ఆరోగ్యకరమైన జీవనశైలి దీని వెనుక బలమైన కారణాలుగా భావిస్తున్నారు. తమ సంతానానికి అత్యుత్తమ ప్రమాణ సంస్థల్లో విద్య నేర్పించడం కోసమని కూడా చెప్తున్నారు. విదేశాల్లో వ్యాపారం కూడా చాలా సులభతరంగా ఉంటుందని వారి భావన.
