ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గలేదు. పోలీసు కాల్పులలో ఓ యువకుడు చనిపోవడంతో దేశమంతటా నిరసనలు మొదలయ్యాయి. నిరసన కారులు వీధుల్లోకి వస్తున్నారు. కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెడుతున్నారు. రోడ్లను బ్లాక్‌ చేస్తున్నారు. పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. బాణాసంచా కాల్చి పోలీసులపైకి విసురుతున్నారు. రోడ్లపై పార్క్‌ చేసిన కార్లకు, బస్‌ డిపోకు కూడా నిప్పు పెట్టారు.

ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గలేదు. పోలీసు కాల్పులలో ఓ యువకుడు చనిపోవడంతో దేశమంతటా నిరసనలు మొదలయ్యాయి. నిరసన కారులు వీధుల్లోకి వస్తున్నారు. కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెడుతున్నారు. రోడ్లను బ్లాక్‌ చేస్తున్నారు. పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. బాణాసంచా కాల్చి పోలీసులపైకి విసురుతున్నారు. రోడ్లపై పార్క్‌ చేసిన కార్లకు, బస్‌ డిపోకు కూడా నిప్పు పెట్టారు. పారిస్‌లోని 12వ డిస్ట్రిక్ట్‌ పోలీస్‌స్టేషన్పై దాడి చేశారు ఆందోళనకారులు. రివోలీ స్ట్రీట్‌లో ఉన్న షాపులను, అతి పెద్ద షాపింగ్‌ మాల్‌ ఫోరం డెస్‌ హాలెస్‌ను దోచుకున్నారు. ప్రభుత్వం 40 వేల మంది పోలీసులను రంగంలోకి దించినా ఉద్రిక్తతలు చల్లారలేదు. టియర్‌గ్యాస్‌, వాటర్‌ కెనన్లను ప్రయోగిస్తున్నారు పోలీసులు. రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రత్తగా పారిస్‌లో బస్సు, ట్రామ్‌ సర్వీసులను నిలిపవేశారు. ఆందోళనకారుల దాడులలో ఇప్పటికే 200 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు.

మరోవైపు దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేయడానికి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. టీనేజీ యువకులను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని తల్లిదండ్రులకు అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మక్రాన్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలో అల్లర్లకు సోషల్‌ మీడియానే హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి తర్వాత అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్‌ మీడియానే ప్రముఖంగా ఉందన్నారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న స్నాప్‌ చాట్, టిక్‌టాక్‌ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని మక్రాన్‌ కోరారు. వీడియో గేమ్‌లు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయని, దీంతో కొందరు 24 గంటలూ వీధుల్లోనే గడుపుతున్నారని చెప్పారు.

Updated On 1 July 2023 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story