ఓ మహిళకు ఇద్దరు కవలలు.. కానీ తండ్రులు వేర్వేరు..!

ఓ మహిళకు ఇద్దరు కవలలు.. కానీ తండ్రులు వేర్వేరు..! ఇదెలా అనుకుంటున్నారా. అవును మీరు చదువుతున్నది నిజమే. ఓ స్త్రీ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. కానీ వారి డీఎన్‌ఏ చూస్తే తండ్రులు వేర్వేరుగా నిర్ధారణ అయింది. ఒకే రోజు ఆ స్త్రీ ఇద్దరితో సెక్స్ చేయడమే ఇందుకు కారణమని తేలింది. ఈ ప్రత్యేకమైన కేసు పోర్చుగల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరం నుండి వచ్చింది. ఇక్కడ ఒక 19 ఏళ్ల మహిళ కొంతకాలం క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కవలలకు 8 నెలల వయస్సు వచ్చిన తర్వాత వారి DNA పరీక్ష నిర్వహించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక బిడ్డ DNA అతని తండ్రితో సరిపోలింది. కానీ రెండో బిడ్డ పరీక్ష ఫెయిలైంది. ఆ స్త్రీకి ఆ రోజు వేరే వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆ వ్యక్తితో రెండో బిడ్డకు DNA పరీక్ష చేయించగా అది సరిపోలింది. అంటే, ఆ స్త్రీ ఒకే రోజులో ఇద్దరు పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకుంది.. ఆ స్త్రీ జన్మనిచ్చిన కవల పిల్లలకు తండ్రులు వేరయ్యారు. పిల్లల తండ్రులు ఇద్దరు వేర్వేరు పురుషులు కావచ్చు, కానీ వారి బర్త్ సర్టిఫికెట్‌లో ఒక వ్యక్తి పేరు మాత్రమే ఉండాలి. స్త్రీ యొక్క ఏకైక భాగస్వామి ఇద్దరు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. జనన ధృవీకరణ పత్రంలో కూడా అతని పేరే రాశారు. ఈ మహిళ ప్రొఫైల్‌ను చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసాధారణ గర్భాలపై పరిశోధన చేసే డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ, ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వీటిలో కవలల తండ్రులు భిన్నంగా ఉంటారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అంటారు.

ehatv

ehatv

Next Story