Guyana school fire : పాఠశాలలో అగ్నిప్రమాదం.. 19 మంది పిల్లలు దుర్మరణం
గయానాలోని సెకండరీ స్కూల్ లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది పిల్లలు మరణించారు. ఘటనను ప్రభుత్వం ధృవీకరించింది. రాత్రి సమయంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి సెంట్రల్ సిటీ మహ్డియాలోని భవనం పూర్తిగా మంటల్లో మునిగిపోయిందని గయానా ఫైర్ సర్వీస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
గయానా(Guyana)లోని సెకండరీ స్కూల్ లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో 19 మంది పిల్లలు(Studentts) మరణించారు. ఘటనను ప్రభుత్వం ధృవీకరించింది. రాత్రి సమయంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి సెంట్రల్ సిటీ మహ్డియాలోని భవనం పూర్తిగా మంటల్లో మునిగిపోయిందని గయానా ఫైర్ సర్వీస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనా స్థలంలో 14 మంది చిన్నారులు, ఆసుపత్రిలో మరో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఆరుగురిని విమానంలో రాజధాని జార్జ్‌టౌన్(Georgetown)కు తరలించారు. మరికొందరు స్థానిక ఆసుపత్రి సంరక్షణలో ఉన్నారు. దాదాపు 20 మంది విద్యార్థులను రక్షించారు.
మరణించిన 19 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది స్వదేశీయులేనని పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ మార్క్ రామోటర్(Mark Ramotar) తెలిపారు. డార్మ్‌లో సాధారణంగా స్వదేశానికి చెందిన విద్యార్థులు ఉంటారని ఆయన చెప్పాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. దేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధాని మార్క్ ఫిలిప్స్(Mark Philips) , విద్యాశాఖ మంత్రి ప్రియా మాణిక్‌చంద్(Priya Manickchand) సోమవారం తెల్లవారుజామున ఘటనాస్థలిని సందర్శించారు.