పశ్చిమ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు హైవే పైనుండి లోయలో పడటంతో 18 మంది మరణించారు. బ‌స్సులో ఉన్న‌వారు విదేశీయులని.. వారు యూఎస్‌ సరిహద్దుకు వెళుతున్నారని అధికారులు తెలిపారు.

పశ్చిమ మెక్సికో(Western Mexico)లో గురువారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు హైవే పైనుండి లోయలో పడటంతో 18 మంది మరణించారు. బ‌స్సులో ఉన్న‌వారు విదేశీయులని.. వారు యూఎస్‌ సరిహద్దు(US Boarder)కు వెళుతున్నారని అధికారులు తెలిపారు. అమెరికా ఉత్తర సరిహద్దు పట్టణమైన టిజువానా(Tijuana)కు వెళ్లే మార్గంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బస్సులో భారతదేశం(India), డొమినికన్ రిపబ్లిక్(Dominican Republic), ఆఫ్రికన్(African) దేశాల పౌరులతో సహా 42 మంది ప్రయాణికులు ఉన్నారు.

బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు నయారిత్(Nayarit) రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. డ్రైవర్ రోడ్డు వంపు ఉన్న‌చోట కూడా బ‌స్సును వేగంగా నడిపిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరణించిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. గాయపడిన 20 మందిని ఆసుపత్రికి తరలించామ‌ని.. అందులో ఒక‌రి పరిస్థితి విష‌మంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎలైట్ ప్యాసింజర్ లైన్‌లో భాగమైన బస్సు.. రాష్ట్ర రాజధాని టెపిక్(Tepic) వెలుపల హైవేపై బర్రాంకా బ్లాంకా(Barranca Blanca) సమీపంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు.

లోయ దాదాపు 40 మీటర్లు (131 అడుగులు) లోతులో ఉన్నందున.. రెస్క్యూ ఆప‌రేష‌న్ అత్యంత కష్టంగా ఉంద‌ని నయారిత్ భద్రత, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్(Jorge Benito Rodriguez) తెలిపారు.

Updated On 3 Aug 2023 11:16 PM GMT
Yagnik

Yagnik

Next Story