పాకిస్తాన్‌లో(Pakistan) హిందువులు(Hindus) క్షణమో యుగంగా బతుకుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భీతిల్లిపోతున్నారు. గత్యంతరం లేక అవమానాలను భరిస్తూ బతుకీడుస్తున్నారు. హిందూ ఆలయాలను కూల్చివేస్తున్నా గమ్మున ఉండాల్సిన దుస్థితి నెలకొంది.

పాకిస్తాన్‌లో(Pakistan) హిందువులు(Hindus) క్షణమో యుగంగా బతుకుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భీతిల్లిపోతున్నారు. గత్యంతరం లేక అవమానాలను భరిస్తూ బతుకీడుస్తున్నారు. హిందూ ఆలయాలను కూల్చివేస్తున్నా గమ్మున ఉండాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా కరాచీలో(Karachi) 150 ఏళ్ల నాటి ఓ హిందూ ఆలయాన్ని(Temple) సింధ్‌ ప్రావిన్స్‌(Sindh Provinces) ప్రభుత్వం కూల్చివేసింది. అందుకు చెబుతున్న కారణం పురాతన కట్టడం ప్రమాదకరంగా మారిందని..! మరీ మాతా మందిరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని నేలమట్టం కావడంతో హిందువులు దిగ్భాంతికి గురయ్యారు. ఆవేదన చెందారు.

శుక్రవారం అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య అధికారులు ఈ కూల్చివేత కార్యక్రమం చేపట్టారని స్థానికంగా ఉన్న హిందువు రామ్‌నాథ్‌ మిశ్రా మహరాజ్‌ అన్నారు. కూల్చివేతపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రధాన గుడి నిర్మాణాన్ని పూర్తిగా కూల్చేసిన అధికారులు బయట గోడను, గేటును మాత్రం వదిలేశారని చెప్పారు. గత కొంతకాలంగా ఈ స్థలంపై వ్యాపారులు కన్నేశారని, అక్కడ పెద్ద కాంప్లెక్స్‌ను నిర్మించే ఏర్పాట్లు జరుగుతున్నాయని రామ్‌నాథ్‌ మిశ్రా ఆరోపించారు. ఇదిలా ఉంటే సింధ్‌ ప్రావిన్స్‌లోనే మరో ఆలయంపై దుండగులు రాకెట్‌ లాంఛర్లతో దాడి చేశారు. కాశ్మోరే ప్రాంతంలో ఉన్న ఓ చిన్న దేవాలయం దగ్గరకు ఆదివారం తెల్లవారుజామున ఓ తొమ్మిది మంది దుండగులు ఆయుధాలతో వచ్చారు. ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్లపై రాకెట్ లాంఛర్లను ప్రయోగించారు. అదృష్టవశాత్తూ అవి పేలలేదు.

Updated On 17 July 2023 4:49 AM GMT
Ehatv

Ehatv

Next Story