చైనాను(china) చుట్టుపక్కల దేశాలు తిట్టుకుంటున్నాయంటే తిట్టుకోవు మరి! ఆ దేశం అందరితో తగువు పెట్టుకుంటున్నది కాబటి ఇరుగుపొరుగు దేశాలన్నీ ద్వేషిస్తున్నాయి. మనతోనూ అలాగే ప్రవర్తిస్తోంది. చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ దేశంగా అవతరించినప్పటి నుంచి సరిహద్దుల విషయంలో మనతో వివాదాలు పెట్టుకుంటూనే ఉంది. భారత్‌- చైనా(Bharath-China) మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దుకు సంబంధించి గొడవలు పెట్టుకుంటూనే ఉంది.

చైనాను(china) చుట్టుపక్కల దేశాలు తిట్టుకుంటున్నాయంటే తిట్టుకోవు మరి! ఆ దేశం అందరితో తగువు పెట్టుకుంటున్నది కాబటి ఇరుగుపొరుగు దేశాలన్నీ ద్వేషిస్తున్నాయి. మనతోనూ అలాగే ప్రవర్తిస్తోంది. చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ దేశంగా అవతరించినప్పటి నుంచి సరిహద్దుల విషయంలో మనతో వివాదాలు పెట్టుకుంటూనే ఉంది. భారత్‌- చైనా(Bharath-China) మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దుకు సంబంధించి గొడవలు పెట్టుకుంటూనే ఉంది.

జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir), హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh), ఉత్తరాఖండ్‌(Uttar Khand), సిక్కిం(Sikkim), అరుణాచల్‌ ప్రదేశ్‌లలో(Arunachal Pradesh) అనేక భూభాగాలు తమవేనంటూ చైనా అంటోంది. కొన్ని చోట్ల జెండాలు కూడా పాతింది. చాలా మంది అంటున్నట్టుగా మనకు పాకిస్తాన్‌ కంటే చైనానే అత్యంత ప్రమాదకరం. 1950లో టికెట్‌పై దురాక్రమణకు పాల్పిడిన చైనా ఆ తర్వాత భారత్‌లోని చాలా భాగాలు టిబెట్‌కు చెందినవని, వాటిని తమకు అప్పగించాలని మనపై ఒత్తిడి చేస్తూనే ఉంది. మనమేమో హిందూ చినీ భాయ్‌ భాయ్‌ అని అనుకున్నాం.

కానీ ఆ డ్రాగన్ దేశమేమో మనల్ని ఆ రకంగా చూడలేదు. 1962లో మనపై యుద్ధానికి దిగింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లడాక్‌లోని భాగమైన 37 వేల 244 కిలోమీటర్ల అక్సాయ్‌చిన్‌ ప్రాంతాన్ని దురాక్రమించుకుంది. జమ్మూ కశ్మీర్‌లోకి చొచ్చుకు చ్చింది. కశ్మీర్‌ లోయనలోని 5,300 చదరపు కిలోమీటర్ల భూ భాగం తమదేనంటూ గొడవలకు దిగుతోంది. మూడేళ్ల కిందట కూడా చైనా మన భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించింది. మే నెలాఖరులో గల్వాన్ లోయ ప్రాంతంలో ఉన్న భారత భూభాగంలోకి చైనా సైన్యం చొరబడింది. అప్పుడు జరిగిన ఘర్షణలో ఇరువైపులా అనేకమంది సైనికులు చనిపోయారు. 1967లో సిక్కింలోని నాథులా, చోవా ప్రాంతాలలో కూడా చైనా సైన్యం హద్దులు మీరింది.

సరిహద్దులో గస్తీ కాస్తున్న భారత సైన్యంతో ఘర్షణలకు దిగింది. ఆ తర్వాత కూడా ఆ దేశం బుద్ధి మారలేదు. కుక్క తోక వంకర అన్నట్టుగా ఆ దేశం తరచూ మనతో గొడవలకు దిగుతూనే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌ తమ దేశ అంతర్భాగమని వాదించడం చైనా దురాగతానికి పరాకాష్ట. మొదట్లో 90 వేల చదరపు కిలోమీటర్లు అంటే అరుణాచల్‌ప్రదేశ్ మొత్తం తమదేనని వాదించిన చైనా ఇప్పుడేమో 8 వేల చదరపు కిలమీటర్ల భూభాగంపై ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందామంటూ భారత్‌తో బేరాలాడుతోంది. ఇలా బేరాలాడుతూనే వెనుక నుంచి చేయాల్సిందంతా చేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను మాండరిన్‌ భాషలోకి మార్చేసింది చైనా. వీటిలో 8 పేర్లు పట్టణాలు, 2 పేర్లు నదులు, 5 పేర్లు పర్వతాలకు సంబంధించినవి ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తన భూభాగమైన జంగ్‌నన్‌గా పిలుచుకోవడం గమనార్హం.

పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దు వివాదాలకు చైనా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే అప్పుడెప్పుడో చైనాను ఏలిన రాజవంశస్తుల పాలన క్షేత్రాన్ని రుజువుగా చూపిస్తోంది. మధ్య యుగాలనాటి హన్, తంగ్, యువాన్, క్వింగ్‌ రాజవంశీకులు పరిపాలించిన ప్రాంతాలు ఇవేనంటూ సరిహద్దుల విషయంలో ఇతర దేశాలతో యుద్ధానికి దిగుతోంది. ఆ ప్రాంతాలకు రాజుల కాలంలో ఉన్న పేర్లను పెడుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా జరిగిన ఏ ఒక్క ఒప్పందాన్ని కూడా చైనా అంగీకరించడం లేదు. 2020 నుంచి 2050 మధ్యకాలంలో ఆరు మహాయుద్ధాలు జరుగుతాయని గతంలో చైనాకు చెందిన సోహు అనే పోర్టల్‌లో పేర్కొంది. 2025 నాటికి తైవాన్, 2030 నాటికి అన్ని దీవులను, 2040 నాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ను, 2050 నాటికి జపాన్‌కు చెందిన దీవులను స్వాధీన చేసుకోవడానికి చైనా యుద్ధానికి దిగుతుందని పోర్టల్‌ చెబుతోంది.

చైనా చేస్తున్న వాదనలాగే మనం కూడా మౌర్యులు, చోళులు పాలించినప్పటి పరిపాలనా క్షేత్రాన్ని చూపిస్తే చైనాలోని కొంత ప్రదేశం మనకు గ్యారంటీగా దక్కుతుంది. ఒక్క మనతోనే కాదు, కనీసం 15 దేశాలతో చైనాకు సరిహద్దు గొడవలు ఉన్నాయి. తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా, వియత్నాం, జపాన్‌(Japan), దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, సింగపూర్‌(singapoore), బ్రూనై, నైనాల్‌(Nainal), భూటాన్‌(Bhutan), లావోస్‌, మంగోలియా, మయన్మార్‌ తదితర దేశాలతో చైనా సరిహద్దు తగాదాలు పెట్టుకుంటోంది. దక్షిణ చైనా సముద్రం అంతా తమ కంట్రోల్‌లోనే ఉండాలన్నది చైనా భావన. అసలు తైవాన్‌ మొత్తం తమదేనని చైనా అంటోంది. ప్రస్తుతానికి మెకలిస్‌ బ్యాంక్, చైనా ఆక్రమణలో ఉన్న దీవులు, సౌత్‌చైనా సముద్రంలో కొంత భూభాగం విషయంలో తైవాన్‌తో గొడవపడుతూనే ఉంది చైనా.

ఫిలిప్పీన్స్‌(Philippines) విషయంలో కూడా అంతే.. స్కార్‌బరో కొండలు, మరికొన్ని దీవుల విషయంలో ఫిలిప్పైన్స్‌తో తరచుగా ఘర్షణలకు పాల్పడుతోంది. ఇండోనేషియాకు సంబంధించి నతునా దీవులు, సౌత్‌ చైనాలోని కొంత భాగం తమదేనని చెప్పుకుంటోంది చైనా. వియత్నాంలోని అనేక భాగాలు తమవేనని, వాటిని తమకు అప్పగించాలని చైనా డిమాండ్‌ చేస్తోంది. పలు దీవులతో పాటు సముద్ర జలాలలో ఆధిపత్యం కోసం ఘర్షణలకు దిగుతోంది. మొన్నామధ్యన వియత్నాంకు చెందిన చేపల వేట బోటును చైనా నౌకాదళం సముద్రంలో ముంచేసింది కూడా. మలేషియాతోనూ చైనాకు గొడవలు ఉన్నాయి. కొన్ని దీవులు తమవేనని అంటోంది. మలేషియా చమురు అన్వేషణ నౌకలను అడ్డుకుంటోంది. అయితే మలేసియాకు అమెరికా, ఆస్ట్రేలియా యుద్ధ నౌకలు అండగా రావడంతో చైనా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. జపాన్‌కు చెందిన రెండు దీవులను ఆక్రమించుకోవడానికి చైనా నానా రకాలుగా ప్రయత్నిస్తోంది.

సెన్కాకు, ర్యూక్యు(Russia) దీవులలో చమురు నిక్షేపాలు ఉన్నాయి. అందుకే చైనా ఇంతకు తెగిస్తోంది. దక్షిణ కొరియాతో(South Korea), ఉత్తర కొరియాతో(North Korea) సముద్ర జలాల హద్దులపై చైనా వివాదం సృష్టిస్తోంది.
దక్షిణ చైనా సముద్ర జలాల విషయమై సింగపూర్‌తో చైనా గొడవపడుతోంది.
చిన్న దేశమైన బ్రూనైతో(Brunai) కూడా కొన్ని దీవులు, సముద్ర జలాలపై చైనా గొడవ పెట్టుకుంది. నేపాల్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుంది. భూటాన్‌తో అనేక చోట్ల సరిహద్దుల గొడవ నడుస్తోంది. 1980 నుంచి వీటి విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లావోస్‌లో అత్యధిక భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అందుకు యువాన్‌ రాజవంశ పరిపాలనను రుజువుగా చూపిస్తోంది.

Updated On 20 Jun 2023 2:24 AM GMT
Ehatv

Ehatv

Next Story