చైనా(China)లోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం(Fire Accident)లో 13 మంది మరణించారు.

చైనా(China)లోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం(Fire Accident)లో 13 మంది మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. హెనాన్‌లోని యన్‌షాన్‌పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌(Yingcai School)లో మంటలు చెల‌రేగిన‌ట్లు శుక్రవారం రాత్రి 11 గంటలకు స్థానిక అగ్నిమాపక విభాగానికి నివేదించినట్లు అధికారిక జిన్‌హువా వార్తా సంస్థ శనివారం తెలిపింది. రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి 11:38 గంటలకు మంటలను ఆర్పివేశారు.

జిన్హువా వార్తా సంస్థ(Xinhua news agency) ప్రకారం..13 మంది మరణించినట్లు నిర్ధారించబడింది, ఒకరు గాయపడ్డారు. ఈ కేసులో పాఠశాల హెడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అగ్నిప్రమాదం చోటుచేసుకున్న‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

గ‌త‌ నవంబర్‌లో కూడా ఉత్తర చైనా(North China)లోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని బొగ్గు కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోయారు. గతేడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో కూడా 29 మంది మృతి చెందారు.

Updated On 19 Jan 2024 10:19 PM GMT
Yagnik

Yagnik

Next Story