Madagascar Stadium : స్టేడియంలో తొక్కిసలాట.. 12 మంది దుర్మరణం
మడగాస్కర్ రాజధాని అంటనానారివోలోని నేషనల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. మరో 80 మంది గాయపడ్డారు. హిందూ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవం కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

12 Killed, 80 Injured In Madagascar Stadium Stampede
మడగాస్కర్(Madagascar) రాజధాని అంటనానారివో(Antananarivo)లోని నేషనల్ స్టేడియం(National Stadium)లో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. మరో 80 మంది గాయపడ్డారు. హిందూ ఓషన్ ఐలాండ్ గేమ్స్(Indian Ocean Island Games) ప్రారంభోత్సవం కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై మడగాస్కర్ ప్రధాని క్రిస్టియన్ ఎన్‌సీ(Madagascar Prime Minister Christian NC) విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినా(President of Madagascar Andriy Rajolina) ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని అభివర్ణించిన ఆయన.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల మౌనం పాటించాలని స్టేడియంలో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం స్టేడియంలో నిర్వహించే కార్యక్రమం కొనసాగింది.
అంతకుముందు 2019లో మడగాస్కర్‌లోని స్టేడియంలో జరిగిన ఇలాంటి ఘటనలో దాదాపు 15 మంది చనిపోయారు. హిందూ ఓషన్ ఐలాండ్ గేమ్స్ సెప్టెంబర్ 3 వరకు మడగాస్కర్‌లో జరుగనున్నాయి. ఈ క్రీడలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 1977లో రూపొందించింది. ఇందులో మారిషస్(Mauritius), సీషెల్స్(Seychelles), కొమొరోస్(Comoros), మడగాస్కర్, మయోట్(Mayotte), రీయూనియన్(Reunion), మాల్దీవుల(Maldives)కు చెందిన అథ్లెట్లు పాల్గొంటారు.
