భారత్‏లో 70 ఏళ్ళ క్రితం అంతరించి పోయిన అరుదైన చీతాలని తిరిగి పునరుద్దరించడం కోసం ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సౌతాఫ్రికా నుండి IAF యుద్ధ విమానంలో 12 చీతాలని ఇండియా‏కు తీసుకు వచ్చారు. శనివారం ఉదయం మధ్యప్రదేశ్‏లోని గ్వాలియర్ కునో నేషనల్ పార్క్‏కు ఈ చీతాలను తరలించారు. మత్తు మందు ఇచ్చి ప్రత్యేకమైన బోనుల్లో ఈ చీతాలుని విమానం ఎక్కించారు . మొత్తం 12 చీతాలని దక్షిణ ఆఫ్రికా నుండి తీసుకురాగా వీటిలో 7 […]

భారత్‏లో 70 ఏళ్ళ క్రితం అంతరించి పోయిన అరుదైన చీతాలని తిరిగి పునరుద్దరించడం కోసం ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సౌతాఫ్రికా నుండి IAF యుద్ధ విమానంలో 12 చీతాలని ఇండియా‏కు తీసుకు వచ్చారు. శనివారం ఉదయం మధ్యప్రదేశ్‏లోని గ్వాలియర్ కునో నేషనల్ పార్క్‏కు ఈ చీతాలను తరలించారు. మత్తు మందు ఇచ్చి ప్రత్యేకమైన బోనుల్లో ఈ చీతాలుని విమానం ఎక్కించారు . మొత్తం 12 చీతాలని దక్షిణ ఆఫ్రికా నుండి తీసుకురాగా వీటిలో 7 మగవి,5 ఆడవి ఉన్నాయి.

వేటాడటం వల్ల దాదాపు ఈ చీతాలు భారతదేశంలో అంతరించిపోయాయి. భారత అడవుల్లో చీతాల సంతతిని వృద్ధి చేయటం కోసం భారత్ సౌతాఫ్రికా‏తో సమన్వయ ఒప్పదం కుదుర్చుకుంది. గత ఏడాది నమీబియా నుండి తీసుకువచ్చిన 8 చీతాలని కూనో నేషనల్ పార్క్‏లో వదిలారు. ఈ చీతాలని 30 రోజుల పాటు క్వారంటైన్‏లో ఉంచి వేటకు అవి సిద్ధమయ్యాయి అని పరిక్షించాకే వాటిని అడవుల్లోకి వదులుతారు. వీటి కోసం స్పెషల్ ఎన్క్లోజర్ లు కూడా ఏర్పాటు చేశారు. చీతాలు అత్యంత వేగం గా పరుగెత్తి వేటాడగల జంతువులు. ఈ చీతాల వలన పర్యావరణ వ్యవస్థ సమతుల్యం అవుతుంది అలాగే అటవీ సంపద రక్షణ,జల రక్షణ కు ఇవి దోహదం చేస్తాయి.కేంద్రం తలపెట్టిన "ప్రాజెక్ట్ చీతా " లో భాగంగా రానున్న కాలంలో మరిన్ని చీతాలు భారత్‏కు చేరుకోనున్నాయి. వీటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోనుంది.

Updated On 18 Feb 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story