అష్ట దిక్పాలకులలో వరుణుడు ఒకరు. పడమటి దిక్కుకు ఆయన అధిపతి.. వరుణుడి రాజధాని శ్రద్ధావతి. నాగపాశం ఆయన ఆయుధం. మొసలి ఆయన వాహనం. శ్వేతవర్ణుడైన వరుణుడి భార్య శ్యామలాదేవి. వర్షాలకు,నదీనదాలకు, సముద్రాలకు, సమస్త జలాలకు ఈయనే అధిదేవత. వర్షాలు కురవనప్పుడు, అనావృష్టి ఏర్పడినప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వరుణదేవుడు గుర్తుకొస్తాడు. సామూహిక వరుణజపాలు, ప్రార్థనలు జరుపుతారు.

అష్ట దిక్పాలకులలో వరుణుడు ఒకరు. పడమటి దిక్కుకు ఆయన అధిపతి.. వరుణుడి రాజధాని శ్రద్ధావతి. నాగపాశం ఆయన ఆయుధం. మొసలి ఆయన వాహనం. శ్వేతవర్ణుడైన వరుణుడి భార్య శ్యామలాదేవి. వర్షాలకు,నదీనదాలకు, సముద్రాలకు, సమస్త జలాలకు ఈయనే అధిదేవత. వర్షాలు కురవనప్పుడు, అనావృష్టి ఏర్పడినప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వరుణదేవుడు గుర్తుకొస్తాడు. సామూహిక వరుణజపాలు, ప్రార్థనలు జరుపుతారు. మత్స్యకారులు వలలు విసిరేటప్పుడు తప్పనిసరిగా వరుణదేవుడిని స్మరించుకుంటారు. అంతే కానీ ఆయనకు గుళ్లు గోపురాలు కట్టి నిత్యపూజలు చేయడం అరుదు. ఎక్కడో ఒకట్రెండు ఆలయాలు ఉన్నాయి. ఇందులో చెప్పుకోదగ్గది పాకిస్తాన్‌లోని సింధ్‌ రాష్ర్టంలో కరాచీ పట్టణంలో ఉన్న శ్రీ వరుణదేవ్‌ మందిర్‌! మనోరా ద్వీపంలో ఉన్న ఈ దేవాలయం ప్రాచీనమైనది. ఎప్పుడు కట్టారో చెప్పడం కష్టమేకానీ ఇప్పుడున్న నిర్మాణం మాత్రం వందేళ్ల కిందటిదే అయి ఉంటుంది.. లేదూ వెయ్యేళ్ల కాలం నాటిదంటారు కొందరు. సముద్రం నుంచి వచ్చే తేమగాలుల కారణంగా ఆలయం కొద్దిగా దెబ్బతింది..

ప్రస్తుతం పాకిస్తాన్‌ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలోనే ఉన్నప్పటికీ ఆలనాపాలనా కరువయ్యింది. అసలు 1950 నుంచి ఈ గుళ్లో దీపం వెలగడం లేదు. హిందూ కౌన్సిల్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ ఈ ఆలయాన్ని కాపాడుతున్నదంతే! 16వ శతాబ్దంలో భోజోమల్‌ నాన్సీ భాటియా అనే ఓ నౌకా వ్యాపారి మనోరా ద్వీపాన్ని కొన్నాడట! ఆయన కుటుంబ సభ్యులే ఈ దేవాలయ బాగోగులను చూసేవారట! అప్పట్లో ఈ ఆలయంలో పూజలు పునస్కారాలు జరిగేవి.. వానలు కురిపించమని జనం ప్రార్థనలు చేసేవారు.. మొత్తంమీద వరుణదేవుడికి ఇంత మంచి ఆలయం ఉండటం విశేషమే! ఇప్పటికీ చాలా మంది పూజల కోసం ఆలయానికి వస్తుంటారట! మూలవిరాట్టు పాదాలకు తమ నుదురును ఆనించి ప్రార్థన చేస్తారట! ఇప్పుడు ఈ ఆలయానికి మరమ్మతులు జరుగుతున్నాయి.. అమెరికా వంటి దేశాలు విరాళాలు పంపిస్తున్నాయి. ఇప్పుడు ఆలయానికి కళ వచ్చింది.

Updated On 5 July 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story