Russia Attack On Ukrain : ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా, 1000 మంది మృతి
ఉక్రెయిన్‌పై(Ukrain) రష్యా(russia) కోపంతో రగిలిపోతోంది. ఆ కోపాన్ని దాడి రూపంలో చాటుకుంటుంది. వెయ్యి మంది ఉక్రెయిన్ బలగాల ప్రాణాలు తీసింది. తమ అధీనంలో ఉన్న డొనెట్స్క్‌లో ఉక్రెయిన్ పదే పదే దాడులు చేయడాన్ని రష్యా సహించలేకపోయింది. అందుకే భారీ క్షిపణులతో విచక్షణారహితంగా దాడులు చేసింది.

రష్యా(russia) ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో వెళుతున్న ఉక్రెయిన్‌కు రష్యా దిమ్మదిరిగే స్ట్రోక్ ఇచ్చింది. కొద్ది రోజుల కిందట రష్యా స్వాధీనం చేసుకున్న డొనెట్స్క్(Donetsk) ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు కనీసం 35 సార్లు దాడులు చేశాయి. పదే పదే ఇలా దాడులు చేస్తుండటాన్ని రష్యా సహించలేకపోయింది. భారీ మిసైళ్లతో(Missile) ఉక్రెయిన్ బలగాలపై విరుచుకుపడింది. భారీ విధ్వంసాన్ని సృష్టించింది.
ఇందులో కనీసం వెయ్యి మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. గత కొంత కాలంగా కీవ్(Kiev) సైన్యం డొనెట్స్క్‌లోని జనవాసాలపై దాడులు చేస్తూ , వాటిని రష్యా చేసిందని ఆరోపించసాగిందని, అందుకే వారికి గట్టి బుద్ధిచెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా అంటోంది. మరోవైపు భారీ ప్రాణ నష్టం జరిగిందని ఉక్రెయిన్ వర్గాలు కూడా అంగీకరించాయి.