ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో 10 మంది రోడ్ రేసర్లు మరణించారు. తొమ్మిది మంది గాయపడినట్లు ప్రభుత్వం నివేదించింది. బాజా కాలిఫోర్నియా స్టేట్ అటార్నీ జనరల్ ఆఫీస్ ప్రకారం.. ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్-టెరైన్ కార్ రేసింగ్ షో సందర్భంగా ఈ దాడి జరిగింది.

ఉత్తర మెక్సికో(Northern Mexico)లోని బాజా కాలిఫోర్నియా(Baja California)లో శనివారం జరిగిన కార్ షో(Car Show)లో జరిగిన కాల్పుల్లో 10 మంది రోడ్ రేసర్లు(Road Racers)మరణించారు. తొమ్మిది మంది గాయపడినట్లు ప్రభుత్వం నివేదించింది. బాజా కాలిఫోర్నియా స్టేట్ అటార్నీ జనరల్ ఆఫీస్(Baja California State Attorney General’s Office) ప్రకారం.. ఎన్సెనాడా(Ensenada) నగరంలోని శాన్ విసెంటే(San Vicente) ప్రాంతంలో ఆల్-టెరైన్ కార్ రేసింగ్ షో(All-Terrain Car Racing Show) సందర్భంగా ఈ దాడి జరిగింది. పొడవాటి తుపాకీలతో ఉన్న వ్యక్తులు బూడిద రంగు వ్యాన్ నుండి దిగి.. మధ్యాహ్నం 2:18 గంటలకు కాల్పులు జరపడం ప్రారంభించారని రాయిటర్స్(Reuters) నివేదించింది. మునిసిపల్, పోలీసు, మెరైన్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్, మెక్సికన్ రెడ్‌క్రాస్, ఇతర ఏజెన్సీలు వెంట‌నే సంఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని నివేదికలు పేర్కొన్నాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర అటార్నీ జనరల్ రికార్డో ఇవాన్ కార్పియో సాంచెజ్(State Attorney General Ricardo Ivan Carpio Sanchez) ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు మేయర్ అర్మాండో అయాలా రోబుల్స్(Mayor Armando Ayala Robles ) తెలిపారు. బాధితులను గురించి వివ‌రాలు తెలియాల్సివుంది. మెక్సికో రెడ్‌క్రాస్ క్షతగాత్రులను.. ఉత్తర బాజా కాలిఫోర్నియాలోని ఆసుపత్రులకు తరలించార‌ని ఫాక్స్8 నివేదించింది.

Updated On 20 May 2023 10:56 PM GMT
Yagnik

Yagnik

Next Story