Vehicle Rams Into Crowd: జనం మీదకు కారును తీసుకెళ్లిన ఉన్మాది, 10 మంది మృతి
న్యూ ఇయర్ సెలబ్రేషన్ లలో విషాదం చోటు చేసుకుంది. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల మీదకు ఒక కారు దూసుకెళ్లింది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్ లలో విషాదం చోటు చేసుకుంది. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల మీదకు ఒక కారు దూసుకెళ్లింది. (vehicle rams into crowd) ఈ దుర్ఘటనలో పది మంది మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. అమెరికా(America)లోని న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బోర్బన్ స్ట్రీట్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి వేలాది మంది వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఒక కారు వేగంగా అక్కడున్న వారి పైకి దూసుకెళ్లింది. దీంతో సుమారు పది మంది అక్కడికక్కడే మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు., ఈ సంఘటన తర్వాత కారు డ్రైవర్ కిందకు దిగి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరుపడంతో ఆ వ్యక్తి పారిపోయాడు. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.