వెన్నునొప్పి(Back Pain) సమస్య ఇప్పుడు చాలామందిలో సాధారణ సమస్య. కండరాలలో దృఢత్వం లేదా బలహీనంగా ఉండే వెన్నునొప్పి . అలాగే గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం కూడా ఈ సమస్యను దారితీస్తుంది. వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి వైద్యులను సంప్రదిస్తారు. అలాగే యోగా(YOGA), స్ట్రెచింగ్‌ని(Streching) రోజూ చేయడం అలావాటు చేసుకోవాలి.
వెన్నునొప్పి(Back Pain) సమస్య ఇప్పుడు చాలామందిలో సాధారణ సమస్య. కండరాలలో దృఢత్వం లేదా బలహీనంగా ఉండే వెన్నునొప్పి . అలాగే గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం కూడా ఈ సమస్యను దారితీస్తుంది. వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి వైద్యులను సంప్రదిస్తారు. అలాగే యోగా(YOGA), స్ట్రెచింగ్‌ని(Streching) రోజూ చేయడం అలావాటు చేసుకోవాలి. శరీరాన్ని వీలైనంత వరకు చురుకుగా ఉంచుకోవడం ద్వారా వెన్నునొప్పి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అదే సమయంలో ఏ యోగాలో కొన్ని భంగిమలతో వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అదేలాగో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఏఏ యోగా ఆసనాలను క్రమం తప్పకుండా ఆచరించడం ద్వారా వెన్నునొప్పి నుండి బయటపడవచ్చు అని తెలుసుకుందాం.
వెన్నునొప్పికి యోగా భంగిమలు
Marjari Asana (మర్జారీ ఆసనం)
హెల్త్ లైన్ ప్రకారం మర్జారీ ఆసనంతో వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆసనాన్ని పిల్లి, ఆవు భంగిమ అని కూడా అంటారు. ఎలా చేయాలంటే ముందుగా మీ మోకాళ్లపై కూర్చుని, రెండు చేతులకు బరువు పెట్టి టేబుల్ టాప్ పొజిషన్ చేయండి. ఇప్పుడు ఒకసారి నడుమును లోపలికి సాగదీసి, ఆపై దానిని పైకెత్తి సాగదీయండి.
అధోముఖ స్వనాసన(Adhomukha Svanasana)
అధోముఖ స్వనాసనాన్ని డౌన్‌వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ అని కూడా అంటారు. ఇది చేయడానికి కాళ్ళ మధ్య కొద్దిగా దూరం ఉంచడం ద్వారా నేరుగా నిలబడండి. తర్వాత నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ చేతులను పైకి లేపి, ఊపిరి పీల్చుకుంటూ చేతులను వంచి, చేతులతో నేలను తాకాలి. కొన్ని నిమిషాలు ఈ భంగిమలో ఉండటానికి ప్రయత్నించండి.
భుజంగాసనాన్ని(Bhujangasana)
భుజంగాసనం దీనినే నాగుపాము అని కూడా అంటారు. ఇది చేయడానికి మీ చేతులను నేలపై ఉంచి పడుకోండి. రెండు చేతులపై బరువును ఇస్తూ అంటే పైకీ లేపుతూ.. కాళ్ళను వెనుక వైపుకు నిటారుగా ఉంచండి. ఇప్పుడు నడుము నుండి మెడ వరకు వెనుకకు వాల్చండి. కొంత సమయం పట్టుకుని విశ్రాంతి తీసుకున్న తర్వాత పడుకోండి.
సేతుబంధాసనం..(Setubandhasanam)
సేతుబంధాసనం చేయడానికి మీరు వెనుక వైపు నుండి నేరుగా పడుకోవాలి. మోకాళ్లను మడిచి మీ నడుమును వీలైనంత వరకు ఎత్తడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ భంగిమలో కొంత సమయం ఉండండి. అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చాప లేదా నేల మీద పడుకోండి. ఈ యోగాలో వంతెన భంగిమ కూడా చేస్తారు.
బాలసనం..(Balasanam)
బాలసనంను పిల్లల భంగిమ అని కూడా అంటారు. ఇది చేయడానికి మీ మోకాళ్ళను వంచి, వజ్రాసన భంగిమలో చాప మీద కూర్చోండి. ఇప్పుడు రెండు అరచేతులను సాగదీస్తూ ముందుకు వాల్చాలి. మీ బొడ్డు మీ తొడను తాకేలా చూడాలి.. కాసేపు ఇలాగే ఉండి ఆ తర్వాత రిలాక్స్ అవ్వండి.