రోనా వైరస్(Corona Virus) భయాలేమీ ఇక అక్కర్లేదు. వినడానికి వినసొంపుగా ఉన్న ఈ మాట ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మూడున్నరేళ్లుగా ప్రపంచ దేశాలను పట్టి పీడించిన కరోనా వైరస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ దశను దాటేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. లాక్‌డౌన్ అనుభవాన్ని ఇచ్చింది. ఇంటి నుంచి కాలు బయటపెడితే ఏమవుతుందోనన్న భయాన్ని కలిగించింది.
కరోనా వైరస్(Corona Virus) భయాలేమీ ఇక అక్కర్లేదు. వినడానికి వినసొంపుగా ఉన్న ఈ మాట ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మూడున్నరేళ్లుగా ప్రపంచ దేశాలను పట్టి పీడించిన కరోనా వైరస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ దశను దాటేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. లాక్‌డౌన్ అనుభవాన్ని ఇచ్చింది. ఇంటి నుంచి కాలు బయటపెడితే ఏమవుతుందోనన్న భయాన్ని కలిగించింది. లాక్‌డౌన్ కారణంగా ఆర్ధిక వ్యవస్థలను కుప్పకూల్చింది. మొత్తంగా ప్రపంచాన్ని గడగడలాడిచింది. 70 లక్షల మంది ఉసురు తీసుకుంది. ఇప్పుడు కోవిడ్-19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా చూడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధ్నామ్ తెలిపారు. అయితే కరోనా వైరస్ బలహీనపడినప్పటికీ ఇంకా అంతిమదశకు చేరుకోలేదన్నారాయన. ఇప్పటికీ కొన్ని దేశాలలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని, ఇంకా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.