ఒకప్పుడు కేన్సర్‌ అంటే గుండెలు జారిపోయేవి! ప్రాణాల మీద ఆశలు ఆవిరయ్యేవి! చికిత్స లేని ఆ మహామ్మారి జడిపించేది. వణుకుపుట్టించేది. మృత్యురూపిణిలా ముందుకు దూసుకొచ్చేది. ఇప్పడా పరిస్థితి లేదు. ఆధునిక పరిజ్ఞానం కేన్సర్‌ను నివారించదగినంతగా అభివృద్ధి చెందింది. కాకపోతే కెమోథెరపీనే కాసింత బాధాకరం. మనిషిని కుంగదీస్తుంది అది. జుట్టును రాల్చేస్తుంది..ఇలాగే ఓ మహిళకు కేన్సర్‌ సోకింది. కెమోకు ముందు జట్టును తొలగించాల్సిన అవసరం ఏర్పడింది.. ఆమె సెలూన్‌కు వెళ్లింది.. అక్కడ ఓ యువకుడు ఆమె తలవెంట్రుకలు తొలగిస్తున్న […]

ఒకప్పుడు కేన్సర్‌ అంటే గుండెలు జారిపోయేవి! ప్రాణాల మీద ఆశలు ఆవిరయ్యేవి! చికిత్స లేని ఆ మహామ్మారి జడిపించేది. వణుకుపుట్టించేది. మృత్యురూపిణిలా ముందుకు దూసుకొచ్చేది. ఇప్పడా పరిస్థితి లేదు. ఆధునిక పరిజ్ఞానం కేన్సర్‌ను నివారించదగినంతగా అభివృద్ధి చెందింది. కాకపోతే కెమోథెరపీనే కాసింత బాధాకరం. మనిషిని కుంగదీస్తుంది అది. జుట్టును రాల్చేస్తుంది..ఇలాగే ఓ మహిళకు కేన్సర్‌ సోకింది. కెమోకు ముందు జట్టును తొలగించాల్సిన అవసరం ఏర్పడింది.. ఆమె సెలూన్‌కు వెళ్లింది.. అక్కడ ఓ యువకుడు ఆమె తలవెంట్రుకలు తొలగిస్తున్న సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. బాధను అదిమిపెట్టుకోలేకపోయింది.. కన్నీళ్లు పెట్టుకుంది.

ఆమె బాధను ఆ యువకుడు చూడలేకపోయాడు. ఏడుస్తున్న ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఆ యువకుడు ఆగిపోలేదు. ట్రిమ్మర్‌తో తానూ షేవ్‌ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఈ ఎమోషనల్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోను ఇప్పటికే 14 మిలియన్లమందికి పైగా చూశారు.. చూసినవాళ్లంతా ఆ యువకుడి తీరును అభినందించారు. ప్రశంసలు కురిపించారు. మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు.

Updated On 7 Feb 2023 8:29 AM GMT
Ehatv

Ehatv

Next Story