సాధారణంగా సాలీడు(Spider) పురుగులు ఇంట్లోని ఏ మూలనో గూడు కట్టుకుంటాయి లేదా చెట్లు, పందిళ్లపై కూడా గూడు కట్టుకుంటాయి. కానీ ఓ చోట మనిషి చెవిలో(Ear) సాలీడు గూడు కట్టుకుంది. కానీ లండన్‌లో(London) ఓ సాలీడు పురుగు ఏకంగా ఓ మహిళ చెవిలో గూడు కట్టేసుకుంది. పార్ట్ టైం టీచర్‌గా పనిచేసే లూసీ వైల్డ్ (Lucy Wild) అనే మహిళ చెవిలో గత కొంత కాలంగా నొప్పితో బాధపడుతుంది.

సాధారణంగా సాలీడు(Spider) పురుగులు ఇంట్లోని ఏ మూలనో గూడు కట్టుకుంటాయి లేదా చెట్లు, పందిళ్లపై కూడా గూడు కట్టుకుంటాయి. కానీ ఓ చోట మనిషి చెవిలో(Ear) సాలీడు గూడు కట్టుకుంది. కానీ లండన్‌లో(London) ఓ సాలీడు పురుగు ఏకంగా ఓ మహిళ చెవిలో గూడు కట్టేసుకుంది. పార్ట్ టైం టీచర్‌గా పనిచేసే లూసీ వైల్డ్ (Lucy Wild) అనే మహిళ చెవిలో గత కొంత కాలంగా నొప్పితో బాధపడుతుంది. ఈమె తొలిరోజుల్లో ఇది సాధారణ నొప్పే అని భావించింది. రానురాను ఈ నొప్పి ఎక్కువ అవ్వడంతో.. ఇంటిగ్రేటెడ్ కెమెరా(Integrated camera) ఉన్న ఇయర్‌ బర్డ్‌ను చెవిలో పెట్టుకుని చూసి షాక్‌కు గురైంది. తన చెవిలో సాలీడు పురుగు గూడుకట్టుకొని ఉండడాన్ని చూసి ఆందోళన చెందింది.

దీంతో ఈ సాలీడు గూడును(Spider Nest) బయటకు తీసేందుకు ఆమె స్వయంగా ప్రయత్నించింది. సాలీడును బయటకు తీయడానికి వెచ్చిన ఆలివ్‌ ఆయిల్‌ను(Olive Oil) ఉపయోగించింది. దీంతో ఆమె చెవి నుంచి సాలీడు గూడు బయటపడింది. ఇది ఆమె పాపకు వేలిగోరు పరిణామంలో ఉంది. ఈ సందర్భంగా లూసీ మాట్లాడుతూ సాలీడు చెవిలో గూడు పెట్టుకోవడమేంటనని ఆందోళన చెందానని చెప్పింది. సాలీడు గూడును వెలికి తీసినప్పటికీ ఆమెకు ఇంకా నొప్పి(Pain) ఉంది. స్మార్ట్‌ బర్డ్‌ వల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకి చెవిలో నల్లటి పదార్థం ఏదో ఏర్పడింది. దీంతో డాక్టర్‌ను సంప్రదించగా వైద్యులు ఆమె చెవి నుంచి ఆ నల్లటి పదార్థాన్నితొలగించారు. ఈ సమయంలో తనకు వాంతులు అయ్యాయని చెప్పుకొచ్చింది. చెవిలో సాలీడు గూడు తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పింది.

Updated On 29 Dec 2023 1:45 AM GMT
Ehatv

Ehatv

Next Story