ఆకలి, నిద్ర వలే లైంగిక కోరికలు మానవులకు సహజం. సంసార సాగరంలో శృంగారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

ఆకలి, నిద్ర వలే లైంగిక కోరికలు మానవులకు సహజం. సంసార సాగరంలో శృంగారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శారీరక సాన్నిహిత్యం ఇద్దరు వ్యక్తుల మధ్య కెమిస్ట్రీని బలపరుస్తుంది. అయితే శృంగార వాంఛలు పురుషులు వ్యక్తపరిచేంత ఈజీగా స్త్రీలు వ్యక్తపర్చలేరు. గత కొన్నిశతాబ్దాలుగా ఈ అంశంపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఈ అంశం శతాబ్దాలుగా చర్చనీయాంశమైంది. వివిధ అధ్యయనాలు స్త్రీల కోరికలపై ఎన్నో నివేదికలు వెల్లడించినా, అందులో కొన్ని నిజాలు ఉన్నా కానీ వాటికి ఎలాంటి శాస్త్రీయత లేదు. అయితే తాజాగా "సూపర్‌డ్రగ్" (Super Drug)అనే ఆన్‌లైన్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఒక విచిత్రమైన నివేదిక వచ్చింది. మహిళల లైంగిక కోరిక వారంలో ఒక నిర్దిష్ట రోజున గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

వారాంతానికి ముందు రోజు స్త్రీలలో లైంగిక కోరిక ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే.. వారాంతానికి ముందు రోజు మహిళల్లో ఒక ఆలోచన వస్తుందంట. ఈ వారమంతా ఇంటి పని, ఉద్యోగం చేసి అలసిపోయాం. ఇక రేపు ఇంత పని ఉండదన్న ఓ ఫీలింగ్ మహిళల్లో కలిగి.. అది శృంగార కోరికను పెంచేందుకు సహాయపడుతుందని తెలిపింది. ఆ రోజే ప్రియమైన వ్యక్తితో కనెక్ట్ కావాలనే కోరిక తీవ్రమవుతుంది. ఈ రోజుల్లో శృంగారం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక ప్రశాంతత, ఇష్టమైనవారితో గడిపేందుకు సమయం దొరుకుతుండడంతో మహిళలకు లైంగిక కోరికలు కలుగుతాయని ఆన్‌లైన్‌ ద్వారా సర్వే నిర్వహించిన సూపర్‌ డ్రగ్‌ అనే సంస్థ వెల్లడించింది.

ehatv

ehatv

Next Story