ఇంట్లో ప్రతి ఒక్క పని చక్కదిద్ది ఇంటిల్లిపాది భాద్యతలను చక్కదిద్ది చూసుకునే బాధ్యత కలిగిన ప్రతి స్త్రీ కూడా తనమీద తను ఎలాంటి శ్రద్ధ పెట్టదు. నిరంతరం ఇంటి పనులలో కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా వహించడంలో శ్రద్ధ తీసుకునే మహిళలు తమ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించరు. సమయానికి తినరు. ఇది రోజువారి జీవితంలో ఎలాంటి ఇబ్బందిని చూపించకపోయినా ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదాలు తెచ్చి పెడతాయి
ఇంట్లో ప్రతి ఒక్క పని చక్కదిద్ది ఇంటిల్లిపాది భాద్యతలను చక్కదిద్ది చూసుకునే బాధ్యత కలిగిన ప్రతి స్త్రీ కూడా తనమీద తను ఎలాంటి శ్రద్ధ పెట్టదు. నిరంతరం ఇంటి పనులలో కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా వహించడంలో శ్రద్ధ తీసుకునే మహిళలు తమ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించరు. సమయానికి తినరు. ఇది రోజువారి జీవితంలో ఎలాంటి ఇబ్బందిని చూపించకపోయినా ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదాలు తెచ్చి పెడతాయి. కనుక ప్రతి ఒక్క మహిళ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి మారుతున్న
జీవన శైలిలో గుండె పోటు , మధుమేహం,b.p వంటి వ్యాధులు సైలెంట్ గా ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి.ఏమరపాటుగా ఉంటే ఈ వ్యాధులు ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతాయి.
ఇప్పటికే దేశంలో చాలామంది ఆడవాళ్లలో బ్రెస్ట్ కాన్సర్ , సర్వేకల్ క్యాన్సర్ ,గర్భాశయ కాన్సర్ వంటి ఎన్నో రకాల కాన్సర్ కారకాలు
ప్రాణాంతకమైన వ్యాధులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు . సైలెంట్ కిల్లర్స్ లా ఎటాక్ చేసే కొన్ని వ్యాదులని గురించి తెల్సుకుందాం .
కాన్సర్ కారకాలు శరీరంలో ఎపుడు ఎలా మొదలవుతాయి అనే సంకేతాలు లేనప్పటికీ అవి పూర్తిగా వ్యాప్తి చెందితే కానీ వాటి ప్రభావాన్ని మన శరీరం గుర్తించలేదు . ఈ మధ్యకాలం లో ఆడవాళ్ళలో గర్బాశయ కాన్సర్ కూడా ప్రమాదకరంగా మారింది . అందుకే ఈ కాన్సర్ల గురించిన విషయంలో ఏమాత్రం అనుమానం ఉన్న వైద్యుల్ని సంప్రదించాలి ..
తరచూ ఇంటి పనుల్లో అలసట , నరాలవ్యాధులు,నీరసం వంటివి అలానే వస్తున్న ,శ్వాసతీసుకోవటంలో ఇబ్బందులు ,చాతి ఇబ్బందులు ,కాళ్లనొప్పులు , కండరాలసమస్యలు ఉన్న ఈ విషయంలో వైద్యుల్ని సంప్రదించాలి . అలాగే మధుమేహం ఇప్పుడు అందర్నీ పీడిస్తున్న వ్యాధి. దేని వలన కూడా హృదయ సంబంధ వ్యాధులు రావచ్చునని హెచ్చరిస్తున్నారు . అలాగే కళ్ళకు,కాళ్లకు ,చర్మానికి ,తరచూ నడుము నొప్పితో భాదపతున్నఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రాథమిక దశలో ఉన్నపుడే జాగ్రత్తలు తీసుకోవటం వలన ప్రమాదాలనుండి బయట పడవచ్చు . సొంతవైద్యం పనికిరాదని గుర్తించాలి .