మద్యపానం(alcohol) ఆరోగ్యానికి(Health) హానీకరం అని ప్రభుత్వాలు, పలు సంస్థలు చెప్తుంటాయి.
మద్యపానం(alcohol) ఆరోగ్యానికి(Health) హానీకరం అని ప్రభుత్వాలు, పలు సంస్థలు చెప్తుంటాయి. మద్యపానం హానీకరమని మద్యం తాగేవారికి కూడా తెలుసు. మద్యం బాటిళ్లపై కూడా మద్యం ఆరోగ్యానికి హానీకరమని రాస్తారు. మద్యం తాగితే లివర్(Liver) పాడవుతుందని, పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని తెలుసు. కానీ మద్యం మాత్రం మానలేకపోతారు. మద్యానికి బానిసగా ఎందుకు మారుతారో తాజాగా లండన్‌లో(London) ఓ అధ్యయనం పలు కీలక విషయాలు వెల్లడించింది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు(Kings) చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి దీనికి సంబంధించిన నివేదికను ప్రొసిడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో(Procedings Of the National acadamy of sciences) ప్రచురించారు. ఈ అధ్యయనం చెప్తున్న ప్రకారం మద్యాన్ని ఇష్టపడేందుకు ఆర్‌ఏఎస్‌జీఆర్‌ఎఫ్-2 అనే జన్యువు కారణమని తేల్చారు. జన్యుశాస్త్రం, మెదడు రసాయన శాస్త్రంతో పాటు ఆల్కహాల్‌తో ఉన్న సంబంధాన్ని వివరించింది. డోపమైన్ అనేది మెదడులోని ఓ న్యూరో ట్రాన్స్‌మిటర్ అని మనిషికి ఆనందం కలిగినప్పుడు ఈ డొపమైన్ అనే రసాయనం మెదడులో విడుదలవుతుందని చెప్తున్నారు. ఇష్టమైన సంగీతం విన్నా లేదా ఆహారం తిన్నా డోపమైన్ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ఆర్‌ఏఎస్‌జీఆర్‌ఎఫ్-2 జన్యువు ఉన్నవారిలో ఆల్కహాల్ తాగినప్పుడు డోపమైన్ విడుదలయ్యి వీరు ఎక్కువ ఆనందం పొందుతారని అధ్యయంనలో వెల్లడైంది. ఆల్కహాల్‌కు ఎందుకు వ్యసనంగా మారుతున్నారో అని 14 ఏళ్ల వయసు ఉన్న 663 మందిపై పరిశోధనలు జరిపారు. RASGRF-2 జన్యువు ఉన్నవారు ఎక్కువగా మద్యం సేవించేందుకు ఇష్టపడుతున్నారన్నారు. అదే సమయంలో RASGRF-2 జన్యువు లేనివారు మద్యం తాగేందుకు అంతగా ఇష్టపడడం లేదని లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన పరిశోధకుల అధ్యనం వివరించింది.