ఆర్టిఫీషియనల్ స్వీట్‌నర్ .. అంటే కృత్రిమ తీపి పదార్థాలు మహా డేంజర్.. వీటిని పెద్ద మొత్తంలో తీసుకున్నవారికి కేన్సర్(Cancer) వచ్చే ప్రమాదం ఉంది. ఈ వార్త చాలా మందికి ఆందోళన కలిగించే విషయమే ఇది! ఎందుకంటే ఇప్పుడు చాలా ఉత్పత్తుల్లో ఆస్పర్టేమ్‌ను వినియోగిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు చక్కెరకు దూరంగా ఉంటూ కృత్రిమ తీపి పదార్థాలను తీసుకుంటున్నారు.
ఆర్టిఫీషియనల్ స్వీట్‌నర్ .. అంటే కృత్రిమ తీపి పదార్థాలు మహా డేంజర్.. వీటిని పెద్ద మొత్తంలో తీసుకున్నవారికి కేన్సర్(Cancer) వచ్చే ప్రమాదం ఉంది. ఈ వార్త చాలా మందికి ఆందోళన కలిగించే విషయమే ఇది! ఎందుకంటే ఇప్పుడు చాలా ఉత్పత్తుల్లో ఆస్పర్టేమ్‌ను వినియోగిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు చక్కెరకు దూరంగా ఉంటూ కృత్రిమ తీపి పదార్థాలను తీసుకుంటున్నారు. వీటిల్లో కేలరీలు లేకపోవడం వల్ల ఈ మధ్య వీటి వాడకం బాగా పెరిగింది. కూల్‌డ్రింకులు, డైట్ కోక్, చూయింగ్ గమ్, కొన్ని స్వీట్లను దీంతో తయారు చేస్తున్నారు. సుగర్ ఫ్రీ, డైట్ అంటూ వీటిని అమ్ముతున్నారు. కానీ ఇవి అంత ఆరోగ్యకరమైనవి కావని తేలింది. కృత్రిమ తీపి పదార్థాలను పెద్ద మొత్తంలో వాడేవారికి కేన్సర్ ముప్పు 95 శాతం వరకు ఉంటుందని ఓ అధ్యయనంలో స్పష్టమయ్యింది. ముఖ్యంగా ఆస్పర్టేమ్, ఏస్‌సల్ఫేమ్ పొటాషియం అనే ఆర్టిఫీషియల్ స్వీట్‌నర్‌లు బాగా హాని చేస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆస్పర్టేమ్‌ను వినియోగించే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్సీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కి చెందిన పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. ఆస్పర్టేమే కేన్సర్ కారకమని జూలైలో డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఆస్పర్టేమ్‌పై ఫ్రాన్స్‌లో సుమారు లక్ష మంది చిన్నారులపై ఏడాదిగా అధ్యయనం చేశారు. ఆస్పర్టేమ్‌తోనే ఊబకాయంతో ముడిపడిన మలద్వారం, జీర్ణాశయం, కాలేయం, నోరు, స్వర పేటిక, అన్నవాహిక, అండాశయ, ఎండోమెట్రియం, ప్రోస్టేట్ కేన్సర్ల ముప్పు 15 శాతం పెరుగుతున్నట్టు తేలింది. రొమ్ము కెన్సర్ ప్రమాదం అయితే 22 శాతం ఎక్కువవుతోంది. ఏస్‌సల్ఫేమ్ పొటాషియం, ఆస్పర్టేమ్‌లను తక్కువ మోతాదులో తీసుకున్నా కేన్సర్ ముప్పు గణనీయగా పెరుగుతుండటం గమనించదగ్గ అంశం. అంచేత కూల్‌డ్రింక్‌లకు, అలాగే కృత్రిమ తీపి పదార్థాలతో చేసిన స్వీట్లకు దూరంగా ఉండండి..