నాలుగేళ్ల కిందట ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి కోవిడ్‌(Corona) ఆవర్భవించింది. మూడేళ్ల పాటు ప్రపంచ దేశాలను వణికించింది. లక్షలాది మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఇప్పుడు ప్రపంచానికి మరో ప్రమాదకరమైన ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ కంటే ఇది 20 రెట్లు ప్రాణాంతకమని అంటున్నారు. ఈ వ్యాధికి డీసీజ్‌ ఎక్స్‌(Disease X) అని పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO).

నాలుగేళ్ల కిందట ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి కోవిడ్‌(Corona) ఆవర్భవించింది. మూడేళ్ల పాటు ప్రపంచ దేశాలను వణికించింది. లక్షలాది మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఇప్పుడు ప్రపంచానికి మరో ప్రమాదకరమైన ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ కంటే ఇది 20 రెట్లు ప్రాణాంతకమని అంటున్నారు. ఈ వ్యాధికి డీసీజ్‌ ఎక్స్‌(Disease X) అని పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). ఈ డీసీజ్‌ ఎక్స్‌ ఎప్పుడైనా, ఎక్కడైనా రావొచ్చు. ఇప్పటికే వచ్చి ఉండవచ్చు. ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతూ ఉండవచ్చు. దీని పుట్టుకను అంచనా వేయడం దుర్లభం. డిసీజ్‌ ఎక్స్‌తో మానవజాతి అంతం కావచ్చని పరిశోధకులు అంటున్నారు. మొత్తం మీద డిసీజ్‌ ఎక్స్‌ రూపంలో ప్రపంచానికి పెను ప్రమాదం పొంచి ఉందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సెక్యూరిటీలో సీనియర్‌ స్కాలర్‌ అమేశ్‌ అడాల్జా అంటున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని అంటున్నారు. 2018 నుంచి ఎక్స్‌ వ్యాధిపై చర్చ జరుగుతోందని చెప్పారు. ఈ వ్యాధి వైరస్‌ ద్వారా సోకవచ్చు లేదా ఓ జంతుజాతి నుంచి మనుషులకు వ్యాపించవచ్చు. కొత్త లక్షణాలను అభివృద్ధి చేసే ప్రమాదకరమైన వైరస్‌గా మారవచ్చు అని అమేశ్‌ అడాల్జా చెబుతున్నారు. టీకాలు, యాంటీ వైరల్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఎంత వేగంగా అందుబాటులో ఉంటే ఈ వ్యాధిని నిలువరించడం ఈజీ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్‌లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, అయితే వాటినన్నింటిని ప్రమాద కరమైనవిగా పరిగణించలేమని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌ డేమ్‌ కేట్‌ బింగ్‌హామ్‌ అంటున్నారు.

Updated On 11 April 2024 5:22 AM GMT
Ehatv

Ehatv

Next Story