WHO Chief Tedros : కరోనా ముప్పు అలాగే ఉంది.. పోయిన నెల 10 వేల మంది మృతి
ఏ దుర్ముహూర్తాన కరోనా వైరస్(Corona Virus) పుట్టిందో కానీ మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. కనుమరుగవుతున్నట్టే అయ్యి మళ్లీ ఒక్కసారిగా రూపం మార్చుకుని విజృంభిస్తున్నది. ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్(Tedros Athanam Ghebreyesus) హెచ్చరిస్తున్నారు.
ఏ దుర్ముహూర్తాన కరోనా వైరస్(Corona Virus) పుట్టిందో కానీ మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. కనుమరుగవుతున్నట్టే అయ్యి మళ్లీ ఒక్కసారిగా రూపం మార్చుకుని విజృంభిస్తున్నది. ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్(Tedros Athanam Ghebreyesus) హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలలో పాక్షికంగా ప్రబలుతోన్న కోవిడ్(Covid) ఇప్పుడు పెను విపత్తుగా మారిందన్నారు. ఒక్క డిసెంబర్ నెలలోనే కరోనా వైరస్ సోకి పది వేల మందికి పైగా మరణించారని(Death) తెలిపారు. క్రిస్మస్(Christmas) సెలవులప్పుడు కోవిడ్ జేఎన్.1(Covid JN-1) వేరియంట్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందిందని వివరించారు. అమెరికా, యూరప్ దేశాలలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్.
గత ఏడాది నవంబర్ నెలలో హాస్పిటల్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన వారి సంఖ్య 42 నుంచి 62 శాతానికి పెరిగందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీలులేదని, ప్రభుత్వాలు అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు(Vaccines) ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వైరస్ అనూహ్యంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు టీకాలు వేయించుకోవాలని, పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ముందు జాగ్రత్తగా అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తే మంచిదని అన్నారు. మాస్కులు పెట్టుకోవడంవల్ల కొంతలో కొంతైనా కోవిడ్‌ను నిలువరించవచ్చన్నారు. 2019 సంవత్సరం చివర్లో కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్‌లో గుర్తించారు. అక్కడ పుట్టిన ఆ వైరస్ రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గజగజలాడించింది. క్రమంగా వైరస్ వ్యాప్తి తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది.