ఎన్ని మందులు వాడినా దగ్గు(Caugh) పోవడం లేదా. మందులు మిగిని ప్రయోజనం లేదా..? తగ్గాలంటే ఏం చేయాలి...?

చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు విసిగించేది దగ్గు. ఈ దగ్గులో రకరకాలు ఉంటాయి.. ఒక్కోసారి ఈ దగ్గు వలన విసుగు వస్తుంది. ఏం చయాలో తొచక చిరాకు వస్తుంది. ఎటువంటి దగ్గు వచ్చినా సరే దానిని సింపుల్ గా మన వంటింటి వైద్యంతో తగ్గించుకోవచ్చు.

ఎన్ని మందులు వాడినా దగ్గు(Caugh) పోవడం లేదా. మందులు మిగిని ప్రయోజనం లేదా..? తగ్గాలంటే ఏం చేయాలి...?

చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు విసిగించేది దగ్గు. ఈ దగ్గులో రకరకాలు ఉంటాయి.. ఒక్కోసారి ఈ దగ్గు వలన విసుగు వస్తుంది. ఏం చయాలో తొచక చిరాకు వస్తుంది. ఎటువంటి దగ్గు వచ్చినా సరే దానిని సింపుల్ గా మన వంటింటి వైద్యంతో తగ్గించుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ దగ్గు నుండి ఉపశమనం పొంద వచ్చు దగ్గు తగ్గడానికి సింపుల్ నాచ్చూరల్ మెడిసిన్స్ ఏమున్నాయో చూద్దాం...

మిరియాలు దగ్గు నుండి ఉపశమనం ఇస్తాయి... మిరియాల పొడిని నేతితో కలిపి రంగరించి తీసకుంటే దగ్గు మాయమౌతుంది. అంతే కాదు ఈ మిరియాల పొడిని పాలలో కాని టీలో కాని కలిపి బాగా కాగబెట్టి వడకట్టి త్రాగితే దగ్గు తగ్గక మానదు....

దగ్గు బాగా వస్తుంటే తట్టుకోలేనంత దగ్గు ఉంటే కొంచెం అల్లం రసంలో తేనే(Honey) కలుపుకుని ఒక స్పూన్ కాని రెండు స్పూన్లు కాని తీసుకుంటే దగ్గు పారిపోతుంది. ఇలా చేస్తే కొంత మందికి కడుపు మంట వస్తుంది. అప్పుడు మజ్జిగ లాంటి చలువ చేసే పానియాలు తాగాలి.

దగ్గుకు మంచి మందు శొంఠి. ఎండు అల్లాన్ని శొంఠి(Dry Ginger) అంటారు. ఈ శొంఠిని పొడి చేసి పాలలో కాని టీలో కానికలుపుకుని బాగా మరిగించి తాగితే దగ్గు జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.

పసుపు మంచి ఆంటీబయాటిక్(Anti-biotic) పదార్ధం. పసుపు అన్ని వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ పసుపును ఒక స్పూన్ కాని అరస్పూన్ కాని ఒక గ్లాస్ వేడి పాలలో కలుపుకుని, రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే దగ్గు తగ్గడమే కాదు జలుబు, ఇంకా ఇతర ఇన్ఫెక్షన్లు కూడా దూరం అవుతాయి..

రోజూ పని చేసుకుంటూ … చిన్న అల్ల మూక్క కాని, లేకపోతే రెండు మిరియాలు(Black pepper) కాని, చిన్న లవంగం కాని బుగ్గన పెట్టుకుని ఆ రసం మింగుతుంటే దగ్గు బాధించడం ఆగిపోతుంది.

Updated On 23 March 2023 11:26 PM GMT
Ehatv

Ehatv

Next Story