పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉంటారు.

పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉంటారు. చిన్న పిల్లలకుఏం పెట్టాలి. ఏ ఏజ్ లో ఎంత ఫుడ్ పెడితే మంచింది. మరీముఖ్యంగా నాన్ వెజ్ ఫుడ్ ను పిల్లకు ఎప్పుడు పెట్టాలి అనే విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. మరి పిల్లలకు నాన్ వెజ్ ఎప్పుడు పెట్టాలో తెలుసా..?

పిల్లల ఆరోగ్యం కోసం తల్లీ తండ్రులు ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటారు. ఆరు నెలల వరకూ తల్లి పాలు ఇచ్చి.. ఆ తర్వాత బిడ్డ తల్లి పాలతో పాటు తక్కువ మోతాదులో ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తుంటారు. ఈ సమయంలో బిడ్డకు ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఉగ్గు పెడుతుంటారు. అది ఒకే మరి పిల్లలకు మాంసాహారం ఎప్పుడు స్టార్ట్ చేయాలి.. ఎలా స్టార్ట్ చేయాలి.. ఎప్పుడు పెట్టాలి అనేది చాలామందికి తెలియదు. ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.

అయితే డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం 8 నెలల నుంచి నాన్ వెజిటబుల్స్ ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఆకుకూరల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల బిడ్డ ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మీరు మీ బిడ్డకు నాన్ వెజ్ ఇవ్వాలనుకుంటే, ముందుగా గుడ్లతో ప్రారంభించండి. ఒక సంవత్సరం వయస్సు తర్వాత మాత్రమే పిల్లలకు చికెన్ లాంటివి ఇవ్వాలి.

మీరు బిడ్డకు గుడ్లు ఇచ్చిన నాలుగైదు నెలల తరువాత మాంసాహారం పెట్టవచ్చు. ముళ్ళు లేని చేపలు, చికెన్ లాంటివి అతి తక్కువ మోతాదులో పిల్లలకు పెట్టాలి. అది కూడా మెత్తగా ఉడికించినవిమాత్రమే. లేకుంటే చికెన్ ను ముందుగా సూప్‌గా ఇవ్వడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మీరు సరిగ్గా ఉడికించకుండా ఇస్తే.. శిశువుకు డయేరియా మరియు కోలిక్ వంటి సమస్యలు ఉండవచ్చు. ఇక మటన్ లాంటి మాంసాహారం మాత్రం బిడ్డకు రెండేళ్లు నిండిన తర్వాతే ఇవ్వాలి. ఎందుకంటే మేక మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

6 మరియు 12 నెలల మధ్య పిల్లలకు ఐరన్ మరియు జింక్ అవసరం. తల్లి పాలలో ఇవి తగినంతగా లేనందున, పెరుగుతున్న శిశువులకు ఇతర ఐరన్-రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. అలాగే, మాంసంలో ఐరన్ మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. నిజానికి, పండ్లు మరియు ధాన్యాల కంటే గింజలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంటే పిల్లలకు తక్కువ మొత్తంలో మాంసాహారం ఇచ్చినా, వారికి తగినంత పోషకాహారం అందుతుంది. అదే సమయంలో, పిల్లలకు మాంసాహారం ఇచ్చినప్పుడు కాస్త తింటే చాలు కడుపునిండుతుంది.

Updated On 27 Dec 2024 1:31 PM GMT
ehatv

ehatv

Next Story