చిన్న సమస్యలా ఉంటుంది కాని.. చాలా మందికి నరకం చూపిస్తుంది మెడనోప్పి(neck pain) సమస్య. ముఖ్యంగా నిద్రలో చాలా మందికి రెగ్యూలర్ గా మెడపట్టుకుంటుంది. పట్టేయడం వలన నిద్ర లేచిన తర్వాత తలను(head) పక్కకు కదపలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంచెం కదిపినా నొప్పి నరకం చూపిస్తుంది.
చిన్న సమస్యలా ఉంటుంది కాని.. చాలా మందికి నరకం చూపిస్తుంది మెడనోప్పి(neck pain) సమస్య. ముఖ్యంగా నిద్రలో చాలా మందికి రెగ్యూలర్ గా మెడపట్టుకుంటుంది. పట్టేయడం వలన నిద్ర లేచిన తర్వాత తలను(head) పక్కకు కదపలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంచెం కదిపినా నొప్పి నరకం చూపిస్తుంది.
ఇక మర్చిపోయి తల తిప్పే ప్రయత్నం చేస్తే.. ఇక అంతే సంగతులు.. మెడ నొప్పి మరీ మరింత ఎక్కువ అవుతుంది. ఇక రోజంతా.. మెడనొప్పితో ఇబ్బందిపడక తప్ఫదు. ఇక ఏ పని చేయలేరు. అలా బాధపడుతూ.. ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
మెడ పట్టేస్తే.. ఎలా తగ్గించుకోవాలి... ఈ సమస్య ఎప్పటికీ తగ్గుతుందు. ఈ విషయం ఎవరూ చెప్పలేరు. ఈ క్రమంలోనే మెడ పట్టేయడం వల్ల వచ్చే నొప్పులను భరించలేక పెయిన్ కిల్లర్స్(pain killers) వాడుతుంటారు కొందరు. అయితే కొన్ని చిట్కాలను అనుసరిస్తే ఎంతటి మెడ నొప్పి నుంచి అయినా తక్షణ ఉపశమనం పొందవచ్చు.
మరి మెడనొప్పి తగ్గేది ఎలా..? ఏం చేస్తే.. ఉపశమనం లభిస్తుంది. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్రలో మెడ పట్టేసినప్పుడు తలను గట్టిగా తిప్పే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే నొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇంకా అలాంటి సందర్భంలో మీరు చేయవలసిన పని వేడికాపడం. వేడి నీటిలో క్లాత్ ముంచి మెడపై పట్టీ వేయండి. లేదా కాపడం పెటండి. ఇలా ఒకటి రెండు సార్లు చేస్తూ.. ఉపశమనం ఉంటుంది. మెడ పట్టు వదులుతుంది.
మెడ పట్టేసినప్పుడు ఉపశమనం కోసం హీట పాక్(heat pack) మాత్రమే కాదు.. కోల్డ్ ప్యాక్(cold pack) కూడా వేయవచ్చు. ఐస్ ప్యాక్(ice pack) కూడా మెడపై పెట్టుకోవచ్చు. అందుకోసం మీరు కొన్ని ఐస్ క్యూబ్స్(ice cubes) ను క్లాత్ లో కట్టి.. చుట్టి కాపడంలా మెడపై కొద్ది సేపు పెట్టుకోవచ్చు. కొంత సమయం వరకు రుద్దుతూ ఉండాలి. ఇలా నొప్పి ఉన్న ప్రతిచోట కూడా పెట్టుకోవచ్చు.
మెడ పట్టేసినప్పుడు నొప్పిగా ఉన్న ప్రదేశంలో తేలికపాటి మసాజ్(massage) చేయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలాంట సందర్భంలో మీరు మసాజ్ కోసం ఆవాల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు.