అతిగా డోలో-650 వాడితే కలిగే దుష్ప్రభావాలేంటి..!

భారతీయులలో పారాసెటమాల్ వినియోగంపై సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల అమెరికాకు చెందిన ఒక వైద్యుడు భారతీయులు ఈ ట్యాబ్లెట్‌ను "మిఠాయి లాగా" తీసుకుంటారని పేర్కొన్నారు. COVID-19 మహమ్మారి నుంచి డోలో-650 (Dolo-650) అని కూడా పిలువబడే పారాసెటమాల్ చాలా ఇళ్లలోకి వచ్చి చేరింది. జ్వరం, శరీర నొప్పుల కోసం దీనిని విరివిగా వాడుతున్నారు. పారాసెటమాల్‌ను ప్రిస్క్రిప్షన్లు లేదా వైద్యులతో సూచించకపోయినా ఒక సాధారణ మందుగా తీసుకుంటారు. విచక్షణారహితంగా, తరచుగా ఓవర్-ది-కౌంటర్ మందులను ఉపయోగించడం వల్ల తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని ముఖ్యంగా మీ కాలేయంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు ఆరోగ్య విద్యావేత్త డాక్టర్ పళనియప్పన్ మాణికం, "భారతీయులు డోలో 650ని క్యాడ్‌బరీ జెమ్స్ లాగా తీసుకుంటారు" అని అన్నారు. పారాసెటమాల్ అనేది అనాల్జేసిక్, యాంటిపైరేటిక్ ట్యాబ్లెట్. ఇది నొప్పి, జ్వరాన్ని తాత్కాలికంగా తగ్గించడానికి వాడుతారు. దీనిని సాధారణంగా జలుబు, ఫ్లూ మందులలో ఒకటని చెప్తారు.

డోలో 650 (పారాసెటమాల్/ఎసిటమైనోఫెన్) జ్వరం, నొప్పిని తగ్గించడానికి విరివిగా ఉపయోగించే ఔషధం. సరైన మోతాదులో తీసుకుంటే ఇది సురక్షితం. కానీ విచ్చలవిడిగా లేదా అధిక మోతాదులో ఉపయోగిస్తే దుష్ప్రభావాలు సంభవించవచ్చు. కడుపులో అసౌకర్యం లేదా వాంతి భావన.

కొందరిలో జీర్ణ సమస్యలు, అలెర్జీ వల్ల దురద లేదా చర్మంపై ఎరుపు గుర్తులు, అలసట వస్తాయి. డోలో 650ని అధికంగా లేదా సుదీర్ఘ కాలం వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక మోతాదు రోజుకు 4000 mg కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయంలో టాక్సిసిటీ సంభవించవచ్చు. మద్యంతో డోలో 650 తీసుకోవడం కాలేయ నష్టం ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. చాలా అరుదుగా, రక్తంలో తెల్ల రక్త కణాలు లేదా ప్లేట్‌లెట్స్ తగ్గడం వంటి రుగ్మతలు సంభవించవచ్చు. కొందరిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు లేదా మూత్ర విసర్జనలో ఇబ్బందులు రావచ్చు. మలబద్దకం, నోరు పొడిబారడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, నాడీ వ్యవస్థపై ప్రభావం (స్పృహ తప్పినట్లు భావన) వంటివి కొందరిలో కనిపించవచ్చు. పెద్దలకు రోజుకు 4000 mg కంటే ఎక్కువ తీసుకోకూడదు. మోతాదుల మధ్య కనీసం 4-6 గంటల గ్యాప్ ఉండాలి. డోలో 650 తీసుకునేటప్పుడు మద్యం సేవించకూడదు, ఇది కాలేయ నష్టాన్ని తీవ్రతరం చేస్తుంది. డోలో 650ని వైద్య సలహా లేకుండా విచ్చలవిడిగా వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story