మిడిల్ ఏజ్ లో కూడా ప్రెగ్నెంట్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు వాటి వల్ల ఎటువంటి సమస్యలు ఏర్పడుతాయనే వాటి గురించి తెలుసుకుని ఉండాలి.

ప్రస్తుత రోజుల్లో సెలబ్రెటీలతో పాటు చాలా మంది మహిళలు 40ఏళ్ళ వయస్సులో ప్రెగ్నెంట్ అవ్వడమే కాదు...చాలా సులభంగా డెలివరీ అవుతున్నారు. అయితే ఇది అందరికి అన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉండకపోవచ్చు. 40ఏళ్ళ తర్వాత లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వయస్సు తర్వాత ప్రెగ్నెంట్ అవడం సాధ్యమే కానీ ...లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మధ్య వయస్సులో గర్భం ధరించలేరని కాదు. అయితే, మిడిల్ ఏజ్ లో కూడా ప్రెగ్నెంట్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు వాటి వల్ల ఎటువంటి సమస్యలు ఏర్పడుతాయనే వాటి గురించి తెలుసుకుని ఉండాలి. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటినప్పుడు. ఈ వయసులో ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

40 ఏళ్ళు దాటితే ప్రెగ్నెంట్ అవ్వడం, డెలివరీ అవ్వడం ఓ సవాలు అనే చెప్పొచ్చు. సాధారణంగా మహిళలకి ఈ వయసులో కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేట్ ప్రెగ్నెన్సీ వల్ల ఫెర్టిలిటీ సామర్థ్యం అంత బాగుండదు. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్ది శరీరంలో హార్మోనుల సైకిల్(రుత చక్రం) ప్రెగ్నెన్సీకి కాకుండా మోనోపాజ్ కు సన్నద్దమవుతుంటుంది . అందుకే 40 ఏళ్ళ తర్వాత మహిళల్లో రుతుచక్రంలో చాలా తేడాలు కనిపిస్తుంటి. హార్మోను అసమతుల్యత నెలసరిలు ముందే కావడం లేదా చాలా లేటుగా కావడం అనేది జరుగుతుంది. వయస్సు మీరినప్పుడు గర్భంధరించడానికి అవసరం అయ్యే అండాలు గర్భాశయంలో సరిగా ఉత్పత్తికాకపోవడం. దాంతో దీర్ఘకాలిక వయస్సు సమస్యలు అంటే వ్యాధులు డయాబెటిస్ , హైబ్లడ్ ప్రెజర్ వంటి వ్యాధులకు గురి అవుతారు.

లేట్ ప్రెగ్నెన్సీ వల్ల ముఖ్యంగా మహిళలు పుట్టినప్పుడే, అండాశయంలో ఎగ్స్ ఉంటాయి. మహిళలు మెచ్యుర్ అయిన తర్వాత ప్రతి నెలా వచ్చే రుతుచక్ర సమయంలో ఒకటి లేదా రెండు ఎగ్స్ పరిపక్వం చెందుతాయి. 45 ఏళ్ళు వయస్సులో అడుగు పెట్టగానే, అండాశయంలోని ఎగ్స్ .. వయస్సు ఎంత ఉంటుందో అంతే సంఖ్యలో ఎగ్స్ కూడా ఉంటాయి. కనుక ఉన్నవి కూడా ప్రతి నెలా రుతుచక్రంలో పరిపక్వం చెంది బయటకు వచ్చేయడం వల్ల చివరకు రుతుచక్రం నిలిచిపోతుంది. 40లోకి అడుగు పెట్టగానే, 40యే కాదు, 30ఏళ్ళు దాటినా కూడా మోనోపాజ్)కు సన్నద్ధం అవ్వడానికి మొదలుపెడుతుంది. తర్వాత సహజ హార్మోనులు తక్కువ సూచిస్తుంది. దాంతో గర్భం ధరించడానికి సరిపడా హార్మోనులు ఉండవు.

వయసు పెరిగాక ప్రెగ్నెంట్ అయితే వచ్చే సమస్యల్లో ఒకటి మిస్ క్యారేజ్. ఈ వయసులో మహిళలకి ప్రెగ్నెన్సీని తట్టుకునే శక్తి ఉండదు. ఇతర సమస్యలు కూడా ఉంటాయి. దీని వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాదు వయస్సుతో పాటు జబ్బులు కూడ మొదలవుతాయి. అందువల్ల 40ఏళ్ళ తర్వత దీర్ఘకాల వ్యాధులు మధుమేహం, హై బ్లడ్ ప్రెజర్ మొదలవుతాయి. . వయస్సు పైబడ్డ మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ(గర్భసంచికి బయట పిండం) ఏర్పడుటం సర్వసాధారణం. లేటు వయస్సులో గర్భం ధరించినప్పుడు ఇటువంటి అవకాశాలు పెరగడం చాలా ఎక్కువ. లేట్ ప్రెగ్నెన్సీ వల్ల క్యాన్సర్ రిస్క్ లు ఎక్కువ, ముఖ్యంగా బ్రెస్ట్ మరియు ఒవేరియన్ క్యాన్సర్ లు మహిళల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి.

లేట్ వయస్సులో గర్భం ధరించి, ప్రసవించే సమయంలో గుండె మీద అధిక ఒత్తిడి కలుగుతుంది. దరిదాపు వెయ్యి కిలోమీటర్ల వేగం ఉంటుంది! కాబట్టి 40ఏళ్ళలో ఈ ఒత్తిడి అనేది మరికొంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాక, యువతలో గుండెను రక్షించే ఈస్ట్రోజెన్ క్షీణిస్తుంది. లేట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడూ శిశువు పుట్టకతో సంబంధం కలిగి ఉంటాయి. గడువు కంటే ముందుగా ప్రసవించడం వల్ల పుట్టుక లోపాలు ఉండే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా నలభై ఏళ్ళ తర్వాత గర్భం ధరించడం వల్ల పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

Updated On 17 March 2023 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story