దంపతులు ఆరోగ్యంగా, అన్యోన్యంగా ఉండాలంటే శృంగారం(Romance) దోహదపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు చెప్తున్నాయి

దంపతులు ఆరోగ్యంగా, అన్యోన్యంగా ఉండాలంటే శృంగారం(Romance) దోహదపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో దంపతులు శృంగారానికి ఎక్కువ గ్యాప్‌ ఇస్తున్నారని తాజ అధ్యయనంలో తేలింది. దంపతుల మధ్య సెక్స్‌ తరుచుగా లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న బంధాలు, అనుబంధాలు తగ్గిపోతాయని అధ్యయనం చెప్తోంది. అయితే ప్రెగ్నెన్సీ(Pregnancy), పిల్లలు పుట్టిన తర్వాత మహిళల్లో లైంగికాసక్తి తగ్గుతుందని, మెనోపాజ్‌ దగ్గర పడుతున్న మహిళల్లో కూడా కోరికలు కలగవని అంటున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ప్రతి 10 మందిలో ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరో ఒకరికి శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుందని అన్నారు. ఈ సమస్యలతో సెక్స్‌కు దూరంగా ఉంటున్నారు. నెలలు, సంవత్సరాలుగా సెక్స్‌లో పాల్గొనకపోతే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు(Health problems) వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరుచుగా సెక్స్‌లో పాల్గొనకపోతే హర్మోన్‌ లెవల్స్‌ పడిపోతాయని, శరీరంలో రీప్రొడక్టివ్‌ సిస్టం(Reproductive system), యోని ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఆక్సిటోసిన్, ఈస్ట్రోజన్‌ వంటి హార్మోన్లు సరైన మోతాదులో ఉత్పత్తి కావని చెప్తుననారు. ఇవి శరీరంలో తగిన మోతాదులో లేదా అసలే ఉత్పత్తి కాకుంటే శాశ్వతంగా శృంగార కోరికలు తగ్గిపోతాయని దీని ద్వారా మానసిక సమస్యలు కూడా కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. మరో దుష్ప్రభావం ఏంటంటే లైంగికంగా తరుచుగా పాల్గొనకుంటే వజైనల్‌ ఇన్ఫెక్షన్స్‌(Viginal infection) వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయని చెప్తున్నారు. సెక్స్‌లో తరుచుగా పాల్గొనకపోతే ఆ ప్రదేశంలో బ్లడ్‌ సర్కులేషన్ తగ్గుతుందని, దీంతో యోని పొడిబారడమే కాకుండా సాగే గుణం కూడా కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో మరోసారి సెక్స్‌లో పాల్గొనాలంటే అసౌకర్యం కలగడమే కాకుండా నొప్పితో బాధపడతారని, ఈసమస్యలకు దూరంగా ఉండాలంటే సెక్స్‌కు దగ్గర కావాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా లాంగ్‌ గ్యాప్‌ వస్తే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటుందని, వారానికి రెండు సార్లయినా దంపతులు శృంగారంలో పాల్గొంటే దాంపత్య జీవితం అన్యోనంగా సాగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

నిపుణుల సూచనల మేరకు వారంలో రెండు సార్లు కలయికలో పాల్గొనకుంటే దంపతుల్లో ఒత్తిడి పెరుగుతుందని, రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ఆ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని సూచిస్తున్నారు. దంపతుల్లో ఒకరికి ఇష్టం ఉండి, మరొకరికి ఇష్టం లేకుండా చేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగిపోతుందని, దీంతో ఎవరో ఒకరు 'పక్క'చూపులు చూస్తారని హెచ్చరిస్తున్నారు. దాంపత్య జీవనం సరిగా సాగకపోతే వివాహేతర సంబంధాలు ఏర్పడే ప్రమాదం ఉందని, దీంతో కాపురాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం, దంపతులు ఇద్దరూ ఏకంతంగా గడపడం, సెక్సువల్‌ ఫాంటసీల గురించి మాట్లాడుకుంటే ఆ కోరికలు పెరుగుతాయని చెప్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story