తిప్పతీగ(Tippathiga) గురించి ఇప్పటికే చాలా విని ఉంటాం.
తిప్పతీగ(Tippathiga) గురించి ఇప్పటికే చాలా విని ఉంటాం. ఆయుర్వేదంలో(Ayurvedham lo) తిప్పతీగకు ప్రాధాన్యత మామూలుగా లేదు. ఇందు సహజ ఔషధ గుణాలుంటాయి.
తిప్పతీగతో జ్యూస్, క్యాప్సుల్స్, పౌడర్ తయారుచేసి విక్రయిస్తున్నారు. దీని ఆకులు(Leaves), కాండం, వేర్ల(Roots) ద్వారా మందులు తయారు చేస్తారు. తిప్పతీగ ద్వారా శరీరంలో ఉండే రోగాలు చాలా వరకు నయమవుతాయని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు. తిప్పతీగను రోజువారీ తీసుకుంటే శరీరంలో ఉండే చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో జలుబు, దగ్గు, టాన్సిలిటీస్ వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. ఉబ్బసం రోగులకు, గురక, ఛాతి బిగుతుగా ఉన్నవారు ఇది తీసుకుంటే మేలు జరుగుతుంది. తిప్పతీగ జ్యూస్ తాగితే జీర్ణశక్తి(digestion) నయమవుతుందని, మధుమేహం(diabetes), కీళ్ల వ్యాధులు, నులిపురుగులు, జ్వరం, చర్మవ్యాధుల(skin disease) నుంచి ఉపశమనం పొందవచ్చు. తిప్పతీగ వేర్లు, త్రిఫల చూర్ణం కలిపి కషాయంగా తయారుచేసి తేనెతో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. తిప్పతీగ ఆకుతో పాటు బెల్లం కలిసి సేవిస్తే మలబద్ధకం సమస్య నుంచి దూరమవ్వొచ్చు. తిప్పతీగ రసాన్ని రోజూ తాగితే చర్మసమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఉబ్బసం తగ్గుతుంది. దీంట్లో గ్లూకోజ్ స్థాయిలను పెంచే గుణం ఉన్నందున మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కిడ్నీల ఫంక్షనింగ్ కూడా బాగా పెరుగుతుంది.ద దీని వేర్ల కషాయాన్ని తాగితే కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.