అసలే ఇప్పుడు వర్షాకాలం(moonson season). అధిక వర్షాలు పడడంతో పాములు(snakes), తేళ్లు(scorpion) బయటకు వస్తాయి. వర్షాలు పడుతుండడం, వరదలు(floods) రావడంతో రంధ్రాల్లో ఉండే పాములు వాటి రక్షణ కోసం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తాయి.
అసలే ఇప్పుడు వర్షాకాలం(moonson season). అధిక వర్షాలు పడడంతో పాములు(snakes), తేళ్లు(scorpion) బయటకు వస్తాయి. వర్షాలు పడుతుండడం, వరదలు(floods) రావడంతో రంధ్రాల్లో ఉండే పాములు వాటి రక్షణ కోసం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తాయి. ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఇంటి చుట్టూ ఉన్న చెట్లు, చేమల నుంచి పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. పాముకాటుకు(snake bite) గురై కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. పాము కాట్లకు గురై చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్న వార్తలు కూడా చూస్తున్నాం. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో అయితే పాముల బెడదతో భయాందోళనకు గురవుతున్నారు.
వర్షాల సమయంలో పాములు పుట్టలు, రంధ్రాలు నీటితో నిండి పోవడం వల్ల అవి ఉండే ప్రాంతాల నుంచి బయటకు వస్తాయి. వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ ఇంటి ఆవరణలోకి లేదా ఇంట్లోకి కూడా ప్రవేశిస్తాయి. అయితే పాములు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉండేందుకు ఫినాయల్‌ను(phinoil) ఇంటి పరిసరాల్లో చల్లాలని నిపుణులు చెప్తున్నారు. ఇంటి ఆవరణలో ఉండే కోళ్ల గూడు, పశువుపాక, బాత్రూం వంటి ప్రదేశంలో ఈ ఫినాయల్‌ను పిచికారి చేస్తే పాములు ఈ వాసనకు రావని అంటున్నారు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఫినాయిల్ ద్రవాన్ని చల్లడంతో పాముల ప్రవేశాన్ని అరికట్టవచ్చు. ఇందులో ఉండే కార్బోలిక్ యాసిడ్ పాములకు ఇబ్బంది కలిగిస్తాయి. దీని వాసనతో పాములు, తేళ్లు, క్రిములు ఇంటి ఆవరణలోకి రావు. అయితే మనం ఫినాయిల్‌ను పిచికారి చేస్తే వర్షం పడ్డప్పడు అది నీటితో పాటు వెళ్లిపోతుంది. అయితే ఇందులో ఉండే ద్రవణం కార్బొలిక్ యాసిడ్‌నే పిచికారి చేస్తే మరింత ప్రయోజనం ఉందంటున్నారు. కార్బొలిక్ యాసిడ్ అనే లక్ష్మణరేఖలా పనిచేస్తుందని, వారానికోసారి దీనిని ఇంటి పరిసరాల్లో చల్లితే పాముల బెడద నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.