ప్రస్తుతం 'ఘీ కాఫీ'(Ghee cofee) ఫేమస్‌ అవుతోంది.

ప్రస్తుతం 'ఘీ కాఫీ'(Ghee cofee) ఫేమస్‌ అవుతోంది. దీనినే బుల్లెట్ ప్రూఫ్‌(Bullet coffee) కాఫీ అని కూడా అంటున్నారు. ఈ ఘీ కాఫీని సెలెబ్రిటీలు కూడా తాగుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. అయితే ఘీ కాఫీతో చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య రంగ నిపుణులు. నెయ్యి కాఫీలో ఒమేగా 3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఉంది. ఇది శరీరంలో హెల్తీఫ్యాట్‌ను పెంచుతుంది. ఉదయాన్నే నెయ్యి కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఎసిడిటీ సమస్య (acidity)నివారించి, జీర్ణక్రియను(Digestion) మెరుగుపరుస్తుంది. శరీరానికి పోషకాలు అందించడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతుందంటున్నారు. సాధారణంగా కాఫీని తయారుచేసుకున్న తర్వాత ఒక స్పూన్‌ దేశీ నెయ్యి వేసుకొని బాగా మరిగించి తాగాలని సూచిస్తున్నారు. శరీరంలో శక్తి పెరగడమే కాకుండా అనే పోషకాలు అందుతాయని చెప్తున్నారు. నెయ్యిలో విటమిన్ A, E, Kలాంటివి పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. పేగు లైనింగ్‌కు సహాయకారిగా కూడా పనిచేస్తుంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపర్చడమే కాకుండా మానసిక స్థితిని స్థిరంగా ఉంచడంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్ అందించడం, ఆకలి కాకుండా కూడా ఈ నెయ్యి కాఫీ చేయగలదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

Eha Tv

Eha Tv

Next Story