ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే .. . అయితే ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడం మొదలైనవి అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఈ మధ్య ఎక్కువగా వయస్సుతో సంబంధం లేకుండా ... గుండెపోటుతో అకాల మ‌ర‌ణానికి గుర‌వుతున్న సంఘటనలు ఎక్కువ అయ్యాయి.. ఇలాంటి ఘటనల నుంచి మన గుండె పదిలంగా ఉండాలంటే .. న‌డ‌కే మార్గ‌మ‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. యూకేకు చెందిన […]

ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే .. . అయితే ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడం మొదలైనవి అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఈ మధ్య ఎక్కువగా వయస్సుతో సంబంధం లేకుండా ... గుండెపోటుతో అకాల మ‌ర‌ణానికి గుర‌వుతున్న సంఘటనలు ఎక్కువ అయ్యాయి.. ఇలాంటి ఘటనల నుంచి మన గుండె పదిలంగా ఉండాలంటే .. న‌డ‌కే మార్గ‌మ‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. యూకేకు చెందిన జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్ఎస్‌) సూచించిన శారీర‌క శ్ర‌మ‌లో స‌గం చేసినా ప్ర‌తి ప‌ది అకాల మ‌ర‌ణాల్లో ఒక‌దానిని నివారించ‌వ‌చ్చ‌ని 'బ్రిటిష్ జ‌ర్న‌ల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌'లో ప్ర‌చురించిన తాజా అధ్య‌య‌నంలో ప‌రిశోధ‌కులు వెల్లడించారు . అరగంట సేపు వాకింగ్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు . అయితే ఈ బిజీ షెడ్యూల్ లైఫ్ లో ఎక్కువ సేపు వాకింగ్ చేయలేని వారు... కనీసం రోజుకి 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు వేగంగా న‌డిస్తే చాల‌ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. మరి వాకింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం .

ఎంత పని ఒత్తిడిలో వున్నా.. మన సమయంలో కాస్తా సమయాన్ని వాకింగ్‌కి వెచ్చిస్తే చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నిజంగా వాకింగ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. కాబట్టి రెగ్యులర్‌గా ఎంత పనిలో ఉన్నా సరే అరగంట సేపు వాకింగ్ కోసం సమయాన్ని వెచ్చించండి.

వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుండె నొప్పి ఇతర గుండె సమస్యలు వాకింగ్ చేయడం వల్ల దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి . రక్తం సరఫరా కూడా ఎంతో బాగా మెరుగుపడుతుంది. రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తే కొలెస్ట్రాల్ కూడా తగ్గడమే గాకుండా .... బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఇలా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు . అంతేకాదు నడవడం వల్ల మెదడు పని తీరు నుండి కంటి చూపు వరకు ఎన్నో ప్రయోజనాల్ని మనం పొందొచ్చు.

ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి.....ఎక్కువ ఆక్సిజన్ మన శరీరానికి అందుతుంది . దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ఏదైనా సరే మూమెంట్ ఉండటం వల్ల మనం ఎనర్జిటిక్‌గా ఉండటంతొ పాటు బరువు కూడా తగ్గుతారు.

వాకింగ్ వల్ల కార్డియో వాస్క్యులర్ సమస్యలు, టైప్ 2 డయాబెటిస్, కాన్సర్ వంటివి రాకుండా చూసుకోవచ్చు. కదలకుండా అలానే కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. దీని కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అలానే అనవసరమైన కొలెస్ట్రాల్ కూడా ఎక్కువైపోతుంది. వీటి వల్ల చాలా ప్రమాదం కలుగుతుంది. అందుకే వాకింగ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు..

Updated On 4 March 2023 5:30 AM GMT
Ehatv

Ehatv

Next Story