Vesicular stomatitis virus : చైనాలో కొత్త వైరస్.. కరోనా కంటే మహా డేంజర్
మూడేళ్లపాటు ప్రపంచాన్ని వణికించి, లక్షలాది మంది ఉసురు తీసుకుని, దేశ ఆర్థికవ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్(Corona Virus) నెమ్మదించడంతో ఊపిరిపీల్చుకున్నాం. అయినప్పటికీ కొత్త కొత్త రూపాలతో అప్పుడప్పుడు మనల్ని భయపెడుతూనే ఉంది. ఆ ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను పుట్టించిన చైనానే(China) మరో వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలింది.
మూడేళ్లపాటు ప్రపంచాన్ని వణికించి, లక్షలాది మంది ఉసురు తీసుకుని, దేశ ఆర్థికవ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్(Corona Virus) నెమ్మదించడంతో ఊపిరిపీల్చుకున్నాం. అయినప్పటికీ కొత్త కొత్త రూపాలతో అప్పుడప్పుడు మనల్ని భయపెడుతూనే ఉంది. ఆ ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను పుట్టించిన చైనానే(China) మరో వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలింది. ఇది కోవిడ్ కంటే మహా ప్రమాదకరమైన వైరస్ అట! చైనా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ వైరస్‌తో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వైరస్ పేరు వెసిక్యులర్ స్టొమాటైటిస్ వైరస్(Vesicular stomatitis virus). హెబెయ్ మెడికల్ యూనివర్సిటీ(Hebei Medical University) సైంటిస్టులు దీన్ని పుట్టించారు. ఇదొక సింథటిక్ వైరస్(sythetic virus). శరీరంలోకి ప్రవేశించిన మూడు రోజుల్లోనే ప్రాణాలను తీసేస్తుంది. గతంలో ఆఫ్రికన్(african) దేశాలను వణికించిన ఎబోలా వైరస్‌ను పోలి ఉంటుంది. దాని జన్యుక్రమాన్ని అంచనా వేయడంలో భాగంగా దీనికి ప్రాణం పోశారు. ముందుగా పది ఎలుకలపై దీనిని ఇంజెక్ట్ చేశారు. అవయవాలన్ని దెబ్బతిని మూడు రోజుల్లోనే ఆ ఎలుకలు చనిపోయాయి. మన శరీరంలో ప్రవేశించినా అంతే. కణాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది. దాదాపుగా అవయవాలన్నింటికీ సోకుతుంది. వాటి పనితీరును దెబ్బతీస్తుంది. 72 గంటల్లో ప్రాణం తీసేస్తుంది. ఎబోలా వైరస్ సోకితే మనిషి ఎలాంటి అనారోగ్యానికి గురవుతాడు? దాన్ని నివారించడానికి ఏ మందులు వాడాలి? అనేదానిపై చేసిన ప్రయోగాలలో భాగంగా వెసిక్యులర్ స్టొమాటైటిస్‌ను సృష్టించాల్సి వచ్చిందట! పొరపాటున ఇది ల్యాబ్‌లోంచి బయటికి వస్తే మాత్రం పెను ప్రమాదమే!