హస్త ప్రయోగం (ఆత్మ సంతృప్తి) అనేది సమాజంలో అనేక అపోహలు, తప్పుడు నమ్మకాలు ఉన్న అంశం.

హస్త ప్రయోగం (ఆత్మ సంతృప్తి) అనేది సమాజంలో అనేక అపోహలు, తప్పుడు నమ్మకాలు ఉన్న అంశం. ఇది తరచుగా సిగ్గు లేదా అపరాధ భావంతో ముడిపడి ఉంటుంది. ఈ అంశంపై బహిరంగ చర్చ జరగకపోవడానికి కూడా కారణమై ఉండొచ్చు. అయితే, ఇది సాధారణ, సహజమైన ప్రక్రియ అని లైంగిక నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ అనేక అపోహలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి. హస్తప్రయోగం శరీరంపై ఏదైనా చెడు ప్రభావాన్ని చూపుతుందా అంటే వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..!

హస్తప్రయోగం అంటే ఏమిటి?(What is masterbate..?)

హస్తప్రయోగం అనేది ఒక వ్యక్తి తన లైంగిక అవయవాలను తాకడం లేదా ప్రేరేపించడం ద్వారా లైంగికంగా సంతృప్తి చెందే ప్రక్రియ. ఇది లైంగిక ఆరోగ్యం సహజ భాగం. వయస్సు, లింగం లేదా సంబంధాల స్థితితో సంబంధం లేకుండా అందరిలో ఇది సాధారణం.

హస్తప్రయోగం చేయడం సరైందేనా?(Masterbate health benefits)

హస్త ప్రయోగం అనేది ఒక సాధారణ ప్రక్రియ. అది చేసిన తర్వాత, తాము నేరం చేశామనే అపరాధ భావం మానుకోవాలి. దీనిని సాధారణ ప్రక్రియగా పరిగణించాలి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత, భావాలు అభివృద్ధి చెందుతాయని, ఆ తర్వాత కొన్నిసార్లు హస్తప్రయోగం చేయవలసి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇది అప్పుడప్పుడు జరిగితే, అది తప్పుగా పరిగణించకూడదంటున్నారు.

ఈ తప్పు చేయవద్దు:

మీరు హస్తప్రయోగాన్ని ఒక సాధారణ అలవాటుగా చేసుకోవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ ప్రక్రియ మీ చదువులు, కెరీర్ సంబంధిత అలవాట్లు, ఇతర విషయాలపై ప్రభావం చూపేలా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. కానీ ఇది జీవనశైలిని దెబ్బతీయకూడదనేది గ్రహించాలంటున్నారు.

హస్తప్రయోగం ఎప్పుడు తప్పు అవుతుంది?

అధిక హస్తప్రయోగం: తరచుగా హస్తప్రయోగం చేస్తుంటే, అది మీ చదువులకు, పనికి లేదా సామాజిక జీవితానికి అంతరాయం కలిగిస్తుంటే, ఇది సమస్య కావచ్చు. హస్త ప్రయోగం దినచర్య, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపుతున్నట్లయితే, దానిని నియంత్రించడం చాలా ముఖ్యం.

అపరాధ భావన, అవమానం: కొందరు వ్యక్తులు హస్తప్రయోగం తర్వాత ఇబ్బందిగా లేదా నేరంగా భావిస్తారు. సమాజంలో ఉన్న అపోహలే ఇందుకు కారణం కావచ్చు.

శారీరక సమస్యలు: అధిక హస్త ప్రయోగం వల్ల లైంగిక అవయవాలలో నొప్పి, వాపు లేదా ఇతర శారీరక సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంపద్రించాలని చెప్తున్ఆరు.

హస్తప్రయోగానికి సంబంధించి చాలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తారు. దీనికి ఒక కారణం ఏమిటంటే ఈ విషయం గురించి బహిరంగంగా చర్చించకపోవడమే. ఈ వయస్సు ప్రజలు దీనిని తప్పుగా భావించి దాని గురించి మాట్లాడకుండా ఉండటంతో యువతకు తప్పుడు సమాచారం అందుతోంది. హస్తప్రయోగం గురించి ప్రతికూల ఆలోచనలు, అపరాధ భావనలను తొలగించుకోవడం చాలా ముఖ్యం. దీన్ని సాధారణ విషయంగా అర్థం చేసుకోవాలని.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది చేసుకోవాలని సూచిస్తున్నారు. సరైన అవగాహన లేకనే దీనిపై అపోహలు పెట్టుకుంటారని పరిమితంగా మాస్టర్‌బేట్ చేసుకుంటే మేలంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story