తలనొప్పి(Headache).. వయసుతో సబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, కాలంతో సబంధం లేదు, అసలు తల ఉంటే చాలు.. దేనితో సబంధం లేకుండా వచ్చే వాటిలో తలనొప్పి ముందు ఉంటుంది. ఈ తలనొప్పుల గురించి.. వాటిలో రకాల గురించి తెలసుకోవాలి అంటే.. అదో పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. అన్నిరకాల నొప్పులు ఉన్నాయి మరి.

తలనొప్పి(Headache).. వయసుతో సబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, కాలంతో సబంధం లేదు, అసలు తల ఉంటే చాలు.. దేనితో సబంధం లేకుండా వచ్చే వాటిలో తలనొప్పి ముందు ఉంటుంది. ఈ తలనొప్పుల గురించి.. వాటిలో రకాల గురించి తెలసుకోవాలి అంటే.. అదో పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. అన్నిరకాల నొప్పులు ఉన్నాయి మరి.

అందుకే తలనొప్పి సాధారణమైంది అని అనిపిస్తే.. దాన్ని తగ్గించుకోవడం ఎలా..? చాలా సింపుల్ చిట్కాలలో(Tips) తలనొప్పి ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.

తలనొప్పి చాలా రకాలు. అది మైగ్రన్(Migrain) కావచ్చు.. వత్తిడి(Pressure) వల్ల రావచ్చు.. నిద్ర(Sleep) లేకపోవడం వల్ల రావచ్చు, ఎక్కువగా ఆలోచించినా రావచ్చు, వేడి(Heat) వల్ల రావచ్చు.. కోపం ఎక్కువ అయినా రావచ్చు..పనివత్తిడి ఎక్కువగా ఉన్నా రావచ్చు.. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి తలనొప్పికి. మరి అందులో ఏరకమైనరా సరే.. ఈ విషయాలు అనుసరించండి తలనొప్పికి దూరంగా ఉండండి.

మంచి కాఫీ(coffee).. లేదా టీ(Tea) తలనొప్పిని మాయం చేస్తుంది. స్ట్రెస్ రిలీఫ్(stress Relief) ఇస్తుంది. అలా అని ఎప్పుడు పడితే.. అప్పుడు.. ఎలా పడితే అలా తాగకుండదు. రోజులో మూడు కప్పులు మాంచి తాగితే అది కూడా ప్రమాదమే.

మైగ్రేన్‌తో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, చల్లటి గాలి చెవుల్లోకి వెళ్లకూడదు. వారు క్రమం తప్పకుండా పుదీనా తీసుకుంటే మంచిది.

ఇక అల్లం తననొప్పికి మంచి విరుగుడు. అల్లంవల్ల మైగ్రేన్ తల నొప్పి మాత్రమే కాదు.. సాధారణ నోప్పులు కూడా తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది.

చెర్రీస్ తింటే తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వర్క్ ఎక్కువైనప్పుడు తల నొప్పి వస్తే రెండు చెర్రీస్‌ని నమిలితే మంచి రిజల్ట్ ఉంటుంది. జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు వంటివి తలనొప్పికి బాగా పనిచేస్తుంది. ఇవి ఒక రకంగా పెయిన్ కిల్లర్స్‌గా పని చేస్తాయి. తల నొప్పిని తగ్గిస్తాయి.

ఇది సమ్మర్ కదా.. ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండవల్ల వచ్చే డీహైడ్రేషన్ వల్ల కూడా తల నొప్పులు వస్తాయి. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోస వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. సమ్మర్ లో నీరు బాగా తాగండి..తలనొప్పి రాదు.

గోరు వెచ్చని నీటిలో టీ స్పూన్ అల్లం జ్యూస్ మిక్స్ చేసి తాగితే తల నొప్పి మటుమాయం అవుతుంది. గోరు వెచ్చని పాలలో అర చెంచా పసుపు కలుపుకుని తాగితే తల నొప్పి తగ్గుతుంది.

వీలైనంతగా మసాలా ఫుడ్ తగ్గించాలి. విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.వెల్లుల్లి మిశ్రమంలో రెండు బొట్లు నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

Updated On 12 May 2023 12:36 AM GMT
Ehatv

Ehatv

Next Story