భారతదేశంలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్(Mock Drill )ను ప్రకటించింది. మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) సోమవారం ఝజ్జర్((Jhajjar))లోని ఎయిమ్స్‌ను సందర్శించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. మన్సుఖ్ మాండవియా శుక్రవారం కరోనాపై సమావేశం నిర్వహించి.. అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులను ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్‌లను పర్యవేక్షించాలని కోరారు. కరోనా […]

Two-day nationwide mock drill to assess preparedness from today
భారతదేశంలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్(Mock Drill )ను ప్రకటించింది. మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) సోమవారం ఝజ్జర్((Jhajjar))లోని ఎయిమ్స్‌ను సందర్శించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. మన్సుఖ్ మాండవియా శుక్రవారం కరోనాపై సమావేశం నిర్వహించి.. అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులను ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్‌లను పర్యవేక్షించాలని కోరారు. కరోనా ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలను ఎదుర్కోవడానికి రాష్ట్ర, జిల్లా ఆరోగ్య శాఖలు సన్నద్ధంగా ఉండాలని కోరారు.
దేశంలో గత కొన్ని రోజులుగా కోవిడ్(Covid) కేసులు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1న 2,994 కేసులు నమోదు కాగా.. 2వ తేదీన 3,824 కేసులు, 3న 3,641 కేసులు, 4న 3,038 కేసులు, 5న 4,435 కేసులు, 7న 5,335 కేసులు, 8న 6,050 కేసులు, 9న 6,155 నమోదయ్యియి. రోజురోజుకు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 32,814 ఉన్నాయి. ఆదివారం నాటికి రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో దాదాపు 700 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ(Health Department) విడుదల చేసిన డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 3,305 పరీక్షల్లో 699 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive)గా నిర్ధారణ అయ్యింది.
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 7,88 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోగి కొవిడ్ కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రోగుల సంఖ్య 4,587కి చేరింది. గత 24 గంటల్లో కేరళలో 1,800కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్నందున కేరళ(Kerala) ప్రభుత్వం(Kerala Govt) గర్భిణీ స్త్రీలు(Pregnant Women), వృద్ధుల(Elderly people) కు మాస్క్‌లను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలోని ఎర్నాకులం(Ernakulam), తిరువనంతపురం(Thiruvananthapuram), కొట్టాయం(Kottayam)
జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ గా నిర్ధారణ అయిన మెజారిటీ కేసులు ఓమిక్రాన్ వేరియంట్(Omicron variant) కు చెందినవిగా వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని ఆరోగ్య శాఖ సూచించింది.
