కాళ్లు సరిగ్గా లేకుంటే నడవడం కూడా కష్టమే.. కాళ్లు పగుళ్లు వచ్చాయటే అవిచాలా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు నరకం చూపిస్తాయి. ఈక్రమంలో ఈ పగుళ్లనుంచి బయట పడటం ఎలా..? మందులు మింగకుండా కాలి పగుళ్ళు తగ్గించి..మృదువైన పాదాలు సోంతం చేసుకోవడం ఎలా..? చూద్దాం.

కాళ్లు సరిగ్గా లేకుంటే నడవడం కూడా కష్టమే.. కాళ్లు పగుళ్లు వచ్చాయటే అవిచాలా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు నరకం చూపిస్తాయి. ఈక్రమంలో ఈ పగుళ్లనుంచి బయట పడటం ఎలా..? మందులు మింగకుండా కాలి పగుళ్ళు(Cracked Heels) తగ్గించి..మృదువైన పాదాలు సోంతం చేసుకోవడం ఎలా..? చూద్దాం.

చాలా మంది పాదాల్లో పగుళ్ళు, మంటలు, నొప్పులులతో బాధపడుతుంటారు... వీళ్ళు అడుగు తీసి అగుడు వేయడానికి కూడా బాధపడుతుంటారు. అట్లాంటప్పుడు చిన్న చిన్న చిట్కాలతో వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. వాటికి పెద్దగా ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా లేదు.

కాలి పాదాల్లో ఇన్ఫెక్షన్లు, మంటలు వేధిస్తుంటే.. ఈ టిప్స్ పాటించండి. రెండు చెంచాల పసుపులో కాసిని నీళ్లు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని పాదాలకు పూతలా వేసుకోవాలి. అది ఆరాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల్లోని రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. నొప్పి మంట తగ్గుతాయి. పాదాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌(Apple cider Vinegar) అందుబాటులో ఉంటే ఈ సమస్య నుంచి పరిష్కారం పొందొచ్చు. చిన్న టబ్బులో నీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, కొద్దిగా ఎప్సంసాల్ట్‌ వేసి పాదాలను అందులో ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత కాళ్లను శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అర బకెట్‌ నీళ్లలో కొన్ని ఐస్ ముక్కలు వేసి అందులో కాళ్లని ఉంచాలి. ఇలా చేయడం వల్ల మంట, వాపు తగ్గుతాయి. కాసేపయ్యాక మర్దన చేసుకుని మళ్లీ కాళ్లను నీళ్లలో ఉంచాలి. రోజులో ఒకటిరెండుసార్లు ఇలాచేస్తే ఉపశమనం ఉంటుంది.

చిన్ని బకెట్ లో ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ఆనీటిలో పాదాలను శుబ్రం చేసుకోండి.. పాదాలు క్లీన అవుతాయి... మీకు గోరింటాకు తెలుసు కదా.. గోరింటాకును బాగానూరి పాదాలకు పెట్టుకోండి. ఆడవారికి అలవాటు ఉంటుంది కాబట్టి అందానికి అందం. పాదాలు కూడా నునుపుగా తయారు అవుతాయి...

ఇవే కాదు వారానికి మూడు సార్లు పాదాలు, మడాలకు రాత్రి పూట నూనెరాసి.. మర్ధనా చేసి పడుకోండి.. పాదాలకు కావల్సినంత తేమ అంది... పగుళ్ళు మాయమౌతాయి. కాళ్ళు పగిలితే.. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి అందులో పాదాలు నానబెట్టి.. ఆ పగుల్ళు ఉన్న చోట రఫ్ చేయడండి.. పాదాలు నునుపుగా మారుతాయి.

Updated On 28 March 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story