వయసు పెరుగుతున్నా కొద్ది ఎముకలు బలహీనపడుతుంటాయి. అంతే కాదు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు సాధారణంగా వస్తుంటాయి.

వయసు పెరుగుతున్నా కొద్ది ఎముకలు బలహీనపడుతుంటాయి. అంతే కాదు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు సాధారణంగా వస్తుంటాయి. అయితే నేటి సమాజంలో వృధ్ధాప్యం రాకుండానే.. ఈ సమస్యలు ఎదురుకోవలసి వస్తోంది. యువత కూడా కాళ్ళు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దానికి కారణం ప్రస్తుతం ఆహార విధానం కావచ్చు.. జీవన శైలిలలో మార్పులు కూడా కావచ్చు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య తీవ్రమవుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి వ్యాయామంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఎముకలను ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత మోతాదులో కాల్షియం, విటమిన్ డి అవసరం. ఎముకలు చాలా బలహీనంగా ఉంటే, ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఈ రకంగా ఎముక బలహీనపడితే.. చిన్న చిన్న గాయాలకు కూడా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల, ఆరోగ్యకరమైన ఎముకలకు ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. అంటే కాల్షియం, జింక్, విటమిన్ డి, విటమిన్ కె మరియు విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా బలహీనంగా ఉండే వ్యక్తులు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆకుపచ్చని కూరగాయలలో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎముకలు బాగుండాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే పచ్చని కూరగాయలు, ఆకుకూరలు తినాలి. విటమిన్ K ,కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని బాగుపరడంతో పాటు బోన్స్ ను స్ట్రాంగ్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆకుపచ్చ కూరగాయలలో ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి కావల్సినవన్నీ ఉంటాయి. సో డోంట్ మిస్ .

చేపలు కూడా ఎముకలకు చాలా మంచివి. చేపలలో సాల్మన్ , ట్యూనా వంటి కొవ్వు చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఎముకలు బలహీనంగా ఉన్నవారు అప్పుడప్పుడు అయినా ఫ్యాటీ ఫిష్ ను చేర్చుకుంటే మంచిది.

ఎముకలు గట్టిగా ఉండటానికి ఉపయోపడే వాటిలో గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి. వీటిలో మెగ్నీషియం , జింక్ శక్తి ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణంలో ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాదు మెగ్నీషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఆహారంలో ఎక్కువ జింక్‌ని జోడించడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గాయాలను నయం చేయడంలో కూడా జింక్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే రోజువారి ఆహరంలో గుమ్మడి గింజలు చేర్చడం ఎంతో మంచిది.

ఇక నువ్వులలో కాపర్, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు అవిసె గింజలు, సోయాబీన్స్, వాల్‌నట్‌లు మొదలైన వాటిని కూడా ఎముకల ఆరోగ్యానికి తీసుకోవచ్చు. ముఖ్యంగా మీ ఎముకల ఆరోగ్యం బాగుండాలి, అవి ధృడంగా ఉండాలి అంటే ధూమపానం, మద్యపానం మానేయాలి, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు.

ehatv

ehatv

Next Story