చాలా మంది శక్తి హీనులుగా ఉంటారు. నీరసంగా(weakness), బద్దకంగా(lazy), రాలిపోతున్నట్టు.. వాలిపోతున్నట్టు తయారావుతారు. పౌష్టికాహార లోపం. పని వత్తిడి. మానసిక సయస్యల వల్ల కూడా నీరసం వస్తుంది. మరి నీరసం రాకుండా..రోజంతా శక్తితోఉండలి అంటే ఏం చేయాలి. తెలుసుకుందాం..

చాలా మంది శక్తి హీనులుగా ఉంటారు. నీరసంగా(weakness), బద్దకంగా(lazy), రాలిపోతున్నట్టు.. వాలిపోతున్నట్టు తయారావుతారు. పౌష్టికాహార లోపం. పని వత్తిడి. మానసిక సయస్యల వల్ల కూడా నీరసం వస్తుంది. మరి నీరసం రాకుండా..రోజంతా శక్తితోఉండలి అంటే ఏం చేయాలి. తెలుసుకుందాం..

ప్రతిరోజూ వ్యాయామం(excersice).. ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. దాంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే వ్యాయామం నడక తప్పక పాటించండి. నీరసం దగ్గరకు కూడా రాదు.

ఇక మీరు తినే తిండిని ఒక సారి చెక్ చేసుకోండి. ఆ ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కొవ్వు అధికంగా ఉండేవి ఉంటే వాటిని దూరం పెట్టకండి. కొవ్వ పదార్ధాలు తినకూడదు. కూరగాయలు(vegeables), పండ్లు(fruits) ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది. ఉత్తేజం కలుగుతుంది.

కడుపు నిండా తిండి ఎంత ఇంపార్టెంటో..మనిషికి కంటినిండా నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్రలేమి వలన నీరసంగా, అలసటగా ఉంటారు. నిద్రమనకు చాలా ముఖ్యం.. కనుక రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి సేవిస్తే చక్కని నిద్రపడుతుంది.రాత్రి నిద్ర(sleep) సుఖంగా ఉంటే..? పగలంతా ఉల్లాసంగా ఉంటారు.

రోజూ.. గ్లాస్ నిమ్మరసంతో(Lemon juice) కొద్దిగా తేనె(honey), ఉప్పు(salt) కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. నీరసం ఇట్టే మాయమౌతుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఇది తప్పక పాటించండి. ఎండదెబ్బ నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

శరీరంలో రక్తం లేని వలన కూడా నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన రక్తసరఫరా మెరుగుపడుతుంది. నీరసం పరారు అవుతుంది. ఇలా నీరసం తగ్గడానికి.. కొత్త శక్తితో ఉత్తేజం పెరగడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.

Updated On 3 May 2023 12:59 AM GMT
rj sanju

rj sanju

Next Story