కడుపునిండా తిండి ఉన్నా లేకున్నా.. కంటినిండా నిద్ర ఉంటే చాలు.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అదే నిద్ర కరువైతే.. పిచ్చిపట్టినవాడిలా మారిపోతాడు. సమస్యలతో... పని ఒత్తిడితో(pressure) రోజూ నిద్రకు దూరం ఇబ్బంది పడేవారు ఎందరో ఉన్నారు.

కడుపునిండా తిండి ఉన్నా లేకున్నా.. కంటినిండా నిద్ర ఉంటే చాలు.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అదే నిద్ర కరువైతే.. పిచ్చిపట్టినవాడిలా మారిపోతాడు. సమస్యలతో... పని ఒత్తిడితో(pressure) రోజూ నిద్రకు దూరం ఇబ్బంది పడేవారు ఎందరో ఉన్నారు. రాత్రి నిద్ర సరిగా లేకపోతే, మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించి ఇక ఆ రోజంత బద్ధకంగా, నీరసంగా ఉండేలా చేస్తుంది.

నిద్ర(sleep) సరిపోను ఉంటే.. మనిషి ఆరోగ్యంగా హుషారుగా ఉంటాడు. అదేనిద్ర సరిగ్గా లేకపోతే.. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి నిద్ర పోయిన సరిగా నిద్ర రాని వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి కాసేపు హాయిగా.. ప్రశాంతంగా పడుకోవాలంటే ఏం చేయాలి? నిద్ర సూత్రాలు ఏంటీ..?

ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిచేయాలి. ఉదయం వేళ శరీరానికి(Body) తగినంత శ్రమ కలిగిస్తే రాత్రివేళ హాయిగా నిద్ర పడుతుంది. సమయానికి నిద్ర పోవడంతో పాటు ఉదయాన్నే లేవడం ఖచ్చితంగా అమలు చేస్తే నిద్ర హాయిగా పడుతుంది. రాత్రి భోజనం(Dinner) తరువాత కాసేపు అయిన తర్వాత కొద్ది దూరం నడవండి(Walking).. అలా నడిస్తే జీర్ణవ్యవస్థకు(Digestive system) సహకరించి గాఢనిద్ర పడుతుంది.

ఇక నిద్రపోయే గదిలో వెలుగును తగ్గించండి(Dim lights) దీనివల్ల కళ్ళపై ఒత్తిడి కలిగిస్తే కొద్ది నిమిషాలలో నిద్ర వస్తుంది. ప్రధానంగా ఖాళీ సమయం దొరికితే నిద్రపోవడం... సెలవు రోజున అదే పనిగా నిద్ర పోవడం చేయకూడదు.పగటిపూట ఎక్కువసేపు నిద్రపోకూడదు. పగటిపూట ఎక్కువ నిద్రపోతే రాత్రివేళ ఆలస్యంగా నిద్రపట్టడమేకాకుండా, పట్టిన నిద్రకూడా కలత నిద్రగా వుంటుంది.

పగటి వేళల్లో అతిగా టీ, కాఫీలు తాగకూడదు. ముఖ్యంగానిద్రపోవడానికి ఒక గంట ముందు అసలు తాగకూడదు. కాఫీ, టీలలో కెఫిన్ అనే ఉత్ప్రేరకం వుంటుంది. దీని వల్లనిద్రకు భంగం కలుగుతుంది. నిద్రించే గంటముందు టీవీ చూడడం కాని, కంప్యూటర్ వర్క్ లాంటివి చేయకండి..

ఇక నిద్రలోకి మంచిగా జారుకోవాలి అంటే.. నిద్ర మూడ్ రావటానికి రిలాక్స్ ఏదైనా మంచి పుస్తకం(Book) చదవండి. పడుకున్న వెంటనే నిద్ర బాగా
రావాలంటే పుస్తక పఠనం బాగా సహకరిస్తుంది. లేదా మీకిష్టమైన పాటలు(soft music) లేదా సంగీతం వంటివి అతి తక్కువ సౌండ్ తో విని కూడా నిద్రపోవచ్చు. ఇలా ప్రశాంతమైన నిద్రకు చాలా అవకాశాలు ఉన్నాయి.. ఉపయోగించుకోండి.

Updated On 30 April 2023 11:59 PM GMT
Ehatv

Ehatv

Next Story